ఏం చూసి వాళ్లకు ఆఫర్స్ ఇస్తున్నారు – అనుపమ

అనుపమ నటించిన లేటెస్ట్ మూవ పరదా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఈ నెల 22న రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్స్ లో అనుపమ బాగా పార్టిసిపేట్ చేస్తోంది. చేతిలో హిట్స్ లేకపోయినా కొంత మందికి ఛాన్సులొస్తున్నాయని, అదే తనకు అర్థం కావడం లేదని ఆమె అంటోంది. కొంత మంది హీరోయిన్లకు అవకాశాలు ఎలా వస్తాయో నాకు ఇప్పటికీ అర్థం కాదు.

హీరోయిన్లకు మార్కెట్ వాల్యూ ఎలా చూస్తారో తెలియదు. కొందరు హీరోయిన్లకు హిట్లు వస్తాయి కానీ అవకాశాలు రావు. మరికొందరు హీరోయిన్లకు అస్సలు హిట్స్ ఉండవు, కానీ వరుసగా అవకాశాలు వస్తుంటాయి అని చెప్పింది. విజయవాడ ప్రెస్ మీట్ లో బరస్ట్ అయ్యింది అనుపమ. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఎప్పటి నుంచో రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నాం కానీ.. ముందుకు వెళ్లడం లేదు అంటూ ఏడ్చేసింది. అనుపమ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏ హీరోయిన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కామెంట్స్ చేసిందనే విషయమై చర్చ మొదలైంది.

Share your love