Allu Arjun Next : త్రివిక్రమ్ కి బన్నీ అంటే ఎందుకంత స్పెషల్.. అల్లు అర్జున్ సినిమా కోసం భారీగా!!

Allu Arjun Next: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ‘పుష్ప’ మేనియా ఇప్పటికీ కొనసాగుతోంది. దాదాపు ఐదేళ్ల పాటు ఈ పాత్రలో జీవించిన బన్నీ, త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నారు. ఇది వీరి కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా కాగా, ఇది పూర్తిగా విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కనుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
Allu Arjun Next Project Big Budget
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన బన్నీ గత సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌గా నిలిచాయి. కానీ ఈసారి భారీ స్థాయిలో ప్యాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండబోతుందని, కథకి కార్తికేయ స్వామి నేపథ్యం కలిపినట్లు తెలుస్తోంది. పురాణాలకు త్రివిక్రమ్‌కు మంచి పట్టు ఉండటంతో, ఈ కథలో యుద్ధ, భక్తి అంశాలు ప్రధానంగా ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు సినిమాల్లో ఒకప్పటి మైథలాజికల్ చిత్రాలు తిరిగి రావాలని ప్రేక్షకులు కోరుతున్నారు. అలాంటి ప్రయత్నంగా అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలిసి ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌ను మొదలుపెడుతున్నారు. ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు కలసి భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాయి. సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాను 2025 సమ్మర్‌లో మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం బన్నీ స్పెషల్ మేకోవర్ తీసుకుంటున్నారు. సినీ విశ్లేషకుల ప్రకారం, ఈ సినిమాతో అల్లు అర్జున్ మరో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.