
Andrea: ఆండ్రియా జెర్మియా..బోల్డ్ నటిగా ఇండస్ట్రీలో ఫేమస్ అయిన ఆండ్రియా తెలుగులో తడాఖా అనే ఒకే ఒక్క సినిమాలో నటించింది.అయితే ఈ సినిమానే కాకుండా ఈమె తమిళంలో నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యి తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించింది.అయితే అలాంటి ఆండ్రియా జెర్మియా తన పర్సనల్ లైఫ్లో లో వివాదాల ద్వారా ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటుంది. అలా ఆండ్రియా జెర్మియా తన రిలేషన్స్ గురించి కూడా ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగానే ఒప్పుకుంది.
Andrea comments on Pisasu-2
ఆండ్రియా జెర్మియా ఓ ఇంటర్వ్యూలో.. తాను అనిరుధ్ తో రిలేషన్ లో ఉన్నది నిజమేనని,కానీ తనకంటే చిన్నవాడు అవ్వడంతో ఇద్దరి మధ్య రిలేషన్ ఎక్కువ రోజులు కొనసాగలేదని,ఆయనతో రిలేషన్ కట్ అయ్యాక ఓ పెళ్లైన హీరోతో రిలేషన్ పెట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ప్రస్తుతం ఆ రిలేషన్ నుండి బయటపడి చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అలాగే రీసెంట్ గా ఆండ్రియా నటించిన మాస్క్ మూవీ విడుదలై మంచి హిట్ అవ్వడంతో తాను నటించి విడుదలకు నోచుకొని పిశాచి 2 మూవీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.(Andrea)
Also Read: Dharmendra: ధర్మేంద్ర ఆస్తిలో చిల్లిగవ్వ కూడా హేమమాలినికి రాదా.. న్యాయవ్యవస్థ ఏం చెబుతుందంటే.?
ఇక పిశాచి 2 మూవీలో ఆండ్రియా జెర్మియా పూర్తి నగ్నంగా నటించింది అని ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఆండ్రియా మాట్లాడుతూ.. అవును నేను ఈ సినిమాలో డైరెక్టర్ మిస్కిన్ చెప్పిన దాని ప్రకారం బోల్డ్ గా నటించాను. కొన్ని సీన్స్ ఒంటి మీద బట్టలు లేకుండా చేశాను.ఆ సమయంలో డైరెక్టర్ మిస్కిన్ మీద ఉన్న నమ్మకంతోనే నేను ఆ సన్నివేశాలకు ఒప్పుకున్నాను. అయితే కొన్ని మరీ బోల్డ్ సీన్లు రాసి నాకు చెప్పారు.

కానీ ఆ సీన్స్ మాత్రం తెరకెక్కించలేదు. ఇక కొన్ని సీన్స్ లో పూర్తి నగ్నంగా కనిపించాలని చెప్పి షూట్ చేశారు. కానీ వాటిని సినిమాలో పెట్టలేదు.కొంతమంది నా స్కర్ట్స్ లాగమని చెప్పారు. కానీ డైరెక్టర్ మిస్కిన్ అలా చేయలేదు. ఈ సినిమాలో పూర్తి నగ్న సన్నివేశాలు లేవు. కానీ శృంగార సన్నివేశాలు మాత్రం ఉన్నాయి అంటూ పిశాచి 2 మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది నటి ఆండ్రియా జెర్మియా.(Andrea)

