

Rakul Preet Singh: పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సౌత్ లో అంత బిజీగా లేకపోయినప్పటికీ ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ సౌత్ లో పేరున్న హీరోయిన్..టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్ల లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉండేది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఉన్నట్టుండి సడన్గా బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. టాలీవుడ్లో అవకాశాలు వచ్చినా కూడా రిజెక్ట్ చేసింది. దానికి కారణం ఓ హీరోనట.ఆ హీరో వల్లే తను టాలీవుడ్ కి దూరం కావలసి వచ్చింది అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది రకుల్.
Rakul Preet Singh shocking comments
మరి ఇంతకీ రకుల్ టాలీవుడ్ కి దూరం అవ్వడానికి కారణం ఎవరయ్యా అంటే.. సూపర్ స్టార్ మహేష్ బాబు. అదేంటి రకుల్ టాలీవుడ్ కి దూరమవ్వడానికి మహేష్ బాబు ఎలా కారణమవుతారని మీరు అనుమానపడవచ్చు.ఇక అసలు విషయం ఏమిటంటే.. రకుల్ ప్రీత్ సింగ్ మహేష్ బాబు కలిసి నటించిన స్పైడర్ మూవీ అందరూ చూసే ఉంటారు. అయితే ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి భాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ అయింది. (Rakul Preet Singh)
Also Read: Samantha: సమంత మోసం బయటపెట్టిన అసిస్టెంట్ డైరెక్టర్.. ఇలా చేస్తుందని కలలో కూడా ఊహించలేదంటూ.?
ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన సినిమాల్లో తొలి తెలుగు పెద్ద డిజాస్టర్ మూవీ ఇదే కావడంతో రకుల్ చాలా బాధపడిపోయిందట. ఆ బాధలో ఉన్న సమయంలోనే రకుల్ కి టాలీవుడ్ లో కొన్ని ఆఫర్స్ వచ్చినా కూడా రిజెక్ట్ చేసిందట. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పైడర్ మూవీ దెబ్బ కొట్టడంతో రకుల్ కి తెలుగులో సినిమాలు చేయాలి అనిపించలేదట. ముఖ్యంగా ఈ సినిమా డిజాస్టర్ అయిన సమయంలో విమర్శలు,మానసిక వేదన రకుల్ ని పూర్తిగా కుంగిపోయేలా చేశాయట.

అందుకే టాలీవుడ్ నుండి దూరంగా వెళ్లిపోయాను అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది.అలా మహేష్ బాబు స్పైడర్ మూవీ లో నటించి రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కి దూరం అయ్యిందట. ఇక టాలీవుడ్ కి దూరమైనప్పటికీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లకు పర్ఫెక్ట్ జోడీగా సెట్ అయిపోతుంది. రీసెంట్ గానే రకుల్ నటించిన దే దే ప్యార్ దే-2 మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.(Rakul Preet Singh)







