“ఘాటీ” ప్రమోషన్స్ లో కనిపించని అనుష్క

అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ ఘాటీ. ఈ మూవీని క్రిష్ తెరకెక్కించారు. అనుష్క, క్రిష్‌.. వీరిద్దరి కాంబోలో వేదం సినిమా రూపొందడం.. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం తెలిసిందే. ఆతర్వాత ఇప్పుడు మళ్లీ ఈ కాంబోలో ఘాటీ సినిమా రూపొందింది. ఇందులో అనుష్కను ఇప్పటి వరకు చూపించని విధంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ లో చూపించడం విశేషం. సెప్టెంబర్ 5న ఘాటీ సినిమా రిలీజ్ కానున్నట్టుగా ప్రకటించారు.

ఇటీవలే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అనుష్క మాత్రం ఇంత వరకు ఎక్కడ కనిపించలేదు. ఘాటీని అస్సలు ప్రమోట్ చేయడం లేదు. దీంతో అనుష్క అసలు ప్రమోషన్స్ కు వస్తుందా… రాదా..? ఇంటర్ వ్యూలు ఇవ్వకపోయినా.. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అయినా వస్తుందా..? అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఘాటీ మూవీని నిర్మాత రాజీవ్ రెడ్డి, డైరెక్టర్ క్రిష్ ప్రమోట్ చేస్తున్నారు. అనుష్క ప్రమోషన్స్ కు రాలేననే విషయం ముందుగానే చెప్పేసిందని టాక్ వినిపిస్తోంది.

Share your love