“ఎల్లమ్మ”లో శర్వానంద్

బలగం సినిమాతో విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ వేణు. ఈ సినిమా తర్వాత వేణు ఎల్లమ్మ అనే సినిమా చేయాలి అనుకున్నాడు. దిల్ రాజు బ్యానర్ లోనే ఎల్లమ్మ సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశాడు. ఎల్లమ్మ కథ ముందుగా నాని ఆ తర్వాత విశ్వక్ సేన్, ఆ తర్వాత నితిన్ దగ్గరకు వెళ్లింది. నితిన్ తో ఎలమ్మ మూవీ కన్ఫర్మ్ అనే అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు హీరోగా నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.

తాజాగా ఎల్లమ్మ హీరో మారబోతున్నాడని శర్వానంద్ పేరు వినిపిస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ మూవీకి 75 కోట్లు అవుతుందట. ఇమేజ్ ఉన్న హీరో పడితే సినిమా ఎక్కడికో వెళుతుంది. అందుకనే హీరో కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. అవసరం అనుకుంటే.. తమిళ హీరోతో అయినా చేద్దామనే ఆలోచనలో ఉన్నారట. కథానాయికగా సాయిప్లలవి లేదా కీర్తీ సురేష్ ని తీసుకునే ఛాన్స్ ఉందని తెలిసింది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu