Cars under 6 Lakhs

Cars under 6 Lakhs

Cars under 6 Lakhs : ప్రస్తుత కాలంలో కార్ల కొనుగోల్లు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే మార్కెట్లో వివిధ రకాల ఫీచర్లతో కార్లు వస్తున్నాయి. అలాగే బంపర్ ఆఫర్లతో కార్లను తీసుకువస్తున్నాయి ఆయా కంపెనీలు. ఇక కొత్త ఫీచర్లు వచ్చిన కార్లను కొనుగోలు చేసేందుకు.. జనాలు కూడా ఆసక్తి చూపించడం గమనార్హం. అయితే మనం కార్లు కొనుగోలు చేసేటప్పుడు… ఎక్కువగా మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తాం.

సామాన్యులకు కూడా అదే కావాలి. మరి తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మారుతి సుజుకి స్విఫ్ట్… ఈ కారు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ కారు ధర 5.91 లక్షల నుంచి 8.84 లక్షల వరకు ఉంటుంది. ఇక ఈ కారు లీటర్కు 22 నుంచి 23 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

ALSO READ : Acer : Acer నుంచి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ అదుర్స్..!

మారుతి సుజుకి ఎక్స్ ప్రెస్సో : ఈ కారు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా అమ్ముడు పోతుంది. దీని షోరూం ధర వచ్చేసి… 4.25 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇక ఈ కారు ఏకంగా 32 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

రెనో క్విడ్ : ఈ కారు ధర 4.64 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే ఈ కారు ఏకంగా లీటర్కు 22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

టాటా టియాగో : ఈ మధ్యకాలంలో టాటా టియాగో కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. దీని షోరూం ప్రైస్ వచ్చేసి 5.59 లక్షల నుంచి 8.19 లక్షల వరకు ఉంటుంది. ఇక ఈ కారు కిలోమీటర్ కు 26 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 26 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చే కారు సీఎన్‌జీ మోడల్‌ అన్నట్లు. అదే పెట్రోల్ వేరియంట్ అయితే 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మరి ఈ కార్లలో మీకు నచ్చిన కారు కొనుగోలు చేసేయండి. ( Cars under 6 Lakhs )

Join WhatsApp