First Electric Scooter from Acer - Exciting Features

First Electric Scooter from Acer – Exciting Features

Acer ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు కస్టమర్లు ఎక్కువగా ముగ్గు చూపుతున్న విషయం తెలిసిందే . ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించే వారి సంఖ్య కూడా ఇప్పుడు రోజు రోజుకు పెరిగిపోతోంది. ఎందుకంటే ఒకవైపు పర్యావరణాన్ని పరిరక్షించడమే కాదు మరొకవైపు పెట్రోల్, డీజిల్ ఇంధన కరువు ఏర్పడితే ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న ముందు జాగ్రత్తతో ఇలా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే పలు వాహన తయారీ సంస్థలు కూడా కస్టమర్ల డిమాండ్ ను, అవసరాలను అనుగుణంగా సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తూ మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే ఓలా , ఏథర్ , బజాజ్, టీవీఎస్ వంటి సంస్థలు ఈ రేస్ లో ముందు వరుసలో ఉన్నాయి. ఇకపోతే లాప్టాప్ లతో సహా ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్ ల తయారీలో ముందు స్థానంలో నిలిచిన తైవాన్ కి చెందిన ఏసర్ ఎలక్ట్రిక్ 2 వీలర్ ను సరికొత్తగా మార్కెట్లోకి విడుదల చేసింది.

Also Read : Audi India : ఆకర్షణలోనే కాదు వాటిల్లో కూడా దూసుకుపోతున్న ఆడి ఇండియా..!

Acer MUVI 125 4 G పేరుతో సరికొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ ను విడుదల చేస్తూ హైదరాబాదు వేదికగా ఈ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక ఇండియన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్లాట్ఫామ్ eBikeGo భాగస్వామ్యంతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ను తయారు చేయడం జరిగింది. ధర, ఫీచర్స్ విషయానికి వస్తే.. రూ.1,00,000 గా ఎక్స్ షోరూమ్ ధరగా నిర్ణయించబడింది. ముందస్తు బుకింగ్ లు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ఇక ఈ స్కూటర్ 48 V, 35.2 Ah సామర్థ్యం కలిగిన రెండు స్వాపబుల్ బ్యాటరీలను కలిగి ఉంటుంది.

ఒక్కసారి బ్యాటరీని నాలుగు గంటల పాటు పూర్తిగా చార్జింగ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని , 75 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా ప్రయాణం చేస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే ఇందులో రెండు బ్యాటరీలు కూడా ఉంటాయట. ప్రస్తుతం గ్రే, తెలుపు, నలుపు రంగులో అందుబాటులో ఉంది. మెరుగైన షాక్ అబ్జార్బర్ ను కలిగి ఉన్న ఈ స్కూటర్ బ్లూటూత్ కనెక్టివిటీ తో పాటు నాలుగు అంగుళాల ఎల్సిడి డిస్ప్లేని కూడా కలిగి ఉంటుంది.తేలికైన, దృఢమైన చాసిస్ బాడీ ని కలిగి ఉంటుంది. రైడర్ కు మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp