నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో రెండు పురస్కారాలు గెల్చుకుంది కల్ట్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ బేబి. ఈ సంతోషాన్ని మీడియా ముందు షేర్ చేసుకున్నారు మూవీ టీమ్. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నేషనల్ అవార్డ్స్ గెల్చుకున్న సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, డైరెక్టర్ సాయి రాజేశ్, నిర్మాతలు ఎస్ కేఎన్, ధీరజ్ మొగలినేని, సింగర్ రోహిత్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అవార్డ్ గెలవడం తమపై మరింత బాధ్యత పెంచిందని మూవీ నిర్మాత ఎస్ కేఎన్ చెప్పారు.
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాట్లాడుతూ – ఒక చెట్టు పెంచితే అది పండ్లు ఇవ్వడమే కాదు ఎండిపోయాక కూడా ఇళ్లు కట్టుకునేందుకు కలప ఇస్తుంది. అలా ఒక మంచి మూవీ చేస్తే అది మనకు డబ్బుతో పాటు గౌరవాన్ని కూడా ఇస్తుంది. బేబి సినిమా మాకు డబ్బుతో పాటు ఫిలింఫేర్, సైమా, గామా వంటి ఎన్నో పురస్కారాలు తీసుకొచ్చింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ దక్కడం మరింత హ్యాపీగా ఉంది. నా మిత్రుడు సాయి రాజేశ్ బేబి సినిమాను ఎంతో నమ్మాడు. కొన్నేళ్లు కథపై కసరత్తు చేశాడు. అందుకే ప్రతి ఒక్కరినీ ఈ సినిమా ఆకట్టుకుంది. సాయి రాజేశ్ కలర్ ఫొటో తర్వాత మళ్లీ బేబి సినిమాకు నేషనల్ అవార్డ్ గెల్చుకున్నారు. ప్రేమిస్తున్నా పాటను రోహిత్ చాలా బాగా పాడాడు. నేషనల్ అవార్డ్ మాపై మరిన్ని మంచి చిత్రాలు చేయాలనే బాధ్యత పెంచింది. అన్నారు.





Chiranjeevi: పద్మశ్రీ రాజేంద్రప్రసాద్ స్పందన