ఫైర్ స్ట్రోమ్ …వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కొత్త సినిమా ఓజీ నుంచి ఫైర్ స్ట్రోమ్ సింగిల్ రిలీజైంది. ఈ పాటను నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేసిన మేకర్స్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న బిగ్ బుల్ క్లబ్ లో రాత్రి 9 గంటలకు ఈవెంట్ చేయబోతున్నారు. ఈ పాటను ఫ్యాన్స్ కు మంచి థ్రిల్ ఇచ్చేలా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కంపోజ్ చేశారు. అభిమానిగా పవన్ ఎలాంటి సినిమాలో నటిస్తో చూడాలని అనుకున్నానో అలాంటి మూవీ ఓజీ అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో తమన్ చేసిన కామెంట్స్ మూవీ మీద మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.

వకీల్ సాబ్ తో పవన్ కు ఛాట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు తమన్. ఇప్పుడు మరోసారి పవన్ కాంబోలో వర్క్ చేస్తున్నాడు. పవన్ మీద తనకున్న అభిమానాన్ని మ్యూజిక్ తో చూపించబోతున్నాడు తమన్. పైర్ స్ట్రోమ్ పాట పవన్ ఇంట్రో సాంగ్ లా రూపొందించారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu