BALINENI SRINIVAS REDDY : వైసీపీలో చేర‌నున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి..?

BALINENI SRINIVAS REDDY : జ‌న‌సేన‌లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కౌంట్ మొద‌లైంద‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలాగే ఉంటే గౌర‌వంగా ఉండేది. జ‌న‌సేన‌లో చేరిన స‌మ‌యంలో బాగానే ఉన్న‌ప్ప‌టికి రాను రాను అటు జ‌న‌సేన‌, ఇటు టీడీపీ నేత‌ల‌తో వైరం మొద‌లైంది. దీంతో అత‌ను మ‌ళ్లీ సొంత‌గూటికి వెళ్ల‌నున్న‌ట్టు తెలుస్తోంది. మార్చి 19న ఉగాది పండుగ సంద‌ర్భంగా జ‌గ‌న్ స‌మ‌క్షంలో బాలినేని వైసీపీలో చేర‌నున్న‌ట్టు తెలుస్తోంది.

BALINENI SRINIVAS REDDY TO JOIN YCP

ముఖ్యంగా ఒంగోలు లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి-దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్ తో గ‌త కొంత కాలంగా రాజ‌కీయ‌ వైరం కొన‌సాగుతోంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌నార్ద‌న్ చేతిలో బాలినేని ఓట‌మి పాల‌య్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు మంచి మాట‌లు మాట్లాడ‌టాన్ని మ‌న‌సులో పెట్టుకొని జ‌న‌సేన‌లో చేరితే బాగుంటుంద‌ని బావించారు. కానీ బాలినేని ప‌రిస్తితి ప్ర‌స్తుతం అంత‌గానే బాలేదు.

Also Read : CHANDRABABU NAIDU : ఉప ప్రధాని గా వెళ్లాలని చంద్ర‌బాబు ప్రయత్నాలు ?

మ‌రోవైపు బాలినేని పేరు వింటేనే అటు వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అస‌హించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌కాశం జిల్లాలో అత్య‌ధికంగా ల‌బ్ధి పొందింది బాలినేని నే అని ఆ పార్టీ నాయ‌కులు పేర్కొంటున్నారు. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి, బాలినేని బావ బావ‌మ‌రుదులు. వీరిద్ద‌రి మ‌ధ్య వ్య‌క్తిగ‌త విభేదాలు రాజ‌కీయంగా న‌ష్టం చేసుకునేంత వ‌ర‌కు వెళ్లాయి. బాలినేనిని జ‌గ‌న్ ఎంతో విలువ ఇచ్చినా అది నిల‌బెట్టుకోలేక జ‌న‌సేన‌లోకి వెళ్లార‌ని టాక్ వినిపిస్తోంది. ఎట్ట‌కేల‌కు రాజ‌కీయంగా వైసీపీలో చేరేందుకు పూనుకున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Also Read : GEETHIKA VEDHANA BOOK : ‘వేద‌న’ పేరుతో పుస్త‌కం రాసిన టెన్త్ విద్యార్థిని.. ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

Share your love