
TELANGANA : తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ చెప్పింది. త్వరలోనే మరో కొత్త పతకాన్ని వీరి కోసం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే ప్రభుత్వం రుణాలను అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళల కోసం రుణ సౌకర్యంతో పాటు ప్రమాద బీమా కూడా అందిస్తోంది. ఇప్పటివరకు రుణం తీసుకున్న మహిళా ప్రమాదవశాత్తు మరణిస్తే.. ఆ కుటుంబం పై ఆ భారం పడుతోంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కొన్ని కుటుంబాలకు తిరిగి లోన్ చెల్లించడం కష్టంగా ఉంటుంది.
GOOD NEWS FOR THE PEOPLE OF TELANGANA SOON ANOTHER NEW SCHEME
ఇలాంటి సమయంలోనే డ్వాక్రా సంఘంలోని ఇతర సభ్యులపై అదనపు భారం కూడా పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే డ్రాక్రా మహిళల రుణానికి బీమా స్కీమ్ ను అమలు చేయనుంది ప్రభుత్వం.
Also Read : CHANDRABABU NAIDU : ఉప ప్రధాని గా వెళ్లాలని చంద్రబాబు ప్రయత్నాలు ?
ఈ పథకం ద్వారా లోన్ తీసుకున్న మహిళా ప్రమాదవశాత్తు మరణిస్తే.. ప్రభుత్వమే మహిళా చెల్లించాల్సిన రుణాన్ని బ్యాంకు కు అందించనుంది. దీంతో కుటుంబ సభ్యులపై భారం తగ్గుతుంది. ప్రతీ డ్వాక్రా మహిళకు రూ.10లక్షల బీమా సౌకర్యం కల్పించనుంది. ఈ బీమా సొమ్మును ప్రభుత్వమే బ్యాంకు కు చెల్లిస్తుంది. దీంతో రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలందరికీ లబ్ది చేకూరనుంది. ఇటీవలే డ్వాక్రా మహిళలకు రుణబీమా విధానాన్ని అమలు చేయనున్నట్టు మంత్రి సీతక్క ప్రకటించారు.
Also Read : MINISTER SITAKKA : మంత్రి సీతక్క ఇలాకాలో రైతుల భూములను లాక్కుంటున్నఫారెస్ట్ అధికారులు





