GEETHIKA VEDHANA BOOK : ‘వేద‌న’ పేరుతో పుస్త‌కం రాసిన టెన్త్ విద్యార్థిని.. ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

GEETHIKA VEDHANA BOOK : ‘వేద‌న’ పేరుతో పుస్త‌కం రాసిన టెన్త్ విద్యార్థిని.. ప్ర‌భుత్వ కీల‌క నిర్ణ‌యం

GEETHIKA VEDHANA BOOK : ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిని త‌న చిన్న‌త‌నంలోనే ప‌లు క‌విత‌లు, క‌థ‌లు రాస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. సమాజంలో ఉన్న ప‌రిస్థితులు, పేద‌లు ప‌డుతున్న ఇబ్బందులు, సామాజిక అంశాల‌పై ఆమె రాసిన క‌థ‌లు, క‌విత‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం అక్ష‌ర రూపం క‌ల్పించింది. ప్ర‌కాశం జిల్లా కొండ‌పి మండ‌లం జాళ్ల పాలేనికి చెందిన గీతిక త‌న‌ టాలెంట్ తో అద‌ర‌గొడుతోంది. పెద‌కండ్ల గుంట జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతోంది. GEETHIKA VEDHANA BOOK

AP GOVERNMENT HAS DECIDED TO PRINT BOOK VEDANA

గీతిక త‌ల్లి దండ్రులు భ‌వ‌న నిర్మాణ కార్మికులుగా ప‌ని చేస్తుంటారు. ఆమెకు న‌లుగురు అక్క‌లు, సోద‌రుడు ఉన్నారు. వీరిది చాలా పేద కుటుంబం. రెక్కాడితే కానీ డొక్కాడ‌దు. త‌ల్లిదండ్రులు ప‌ని చేస్తేనే వీరికి పూట గ‌డుస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చ‌దువుతూనే సాహిత్యం పై ఆస‌క్తి పెంచుకుంది గీతిక‌. ఐదోత‌ర‌గ‌తినుంచి పుస్త‌కాలు చ‌ద‌వ‌డం అల‌వాటుగా మారింది. అప్ప‌టి నుంచి ర‌చ‌న‌లు చేయ‌డం ప్రారంభించింది. ఏడో త‌ర‌గ‌తి నుంచే క‌విత‌లు, క‌థ‌లు రాయడం మొద‌లు పెట్టింది. GEETHIKA VEDHANA BOOK

Also Read : BALKA SUMAN : బాల్క సుమ‌న్ కి బెయిల్.. కానీ ఆ ష‌ర‌తులు పాటించాల్సిందే..!

ఆమె చ‌దువుకునే పాఠ‌శాల‌లో ఉపాధ్యాయుడు నుంచి ఆమెకు ప్రోత్సాహం ల‌భించింది. గీతిక తొలుత మొక్క అనే క‌విత‌ను రాసింది. ఆ త‌రువాత దాదాపు 55 క‌విత‌లు, 13 క‌థ‌ల‌ను క‌లిసి వేద‌న అనే పుస్త‌కంగా రూపొందించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఆదేశాల‌తో ఈ పుస్త‌కాన్ని వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రంలో అన్ని పాఠ‌శాల‌లో అందుబాటులో ఉంచ‌నున్నారు. ఇటీవ‌ల ఆమె రాసిన మౌనం దాట‌ని మాట‌లు వ‌ర‌కు కూడా ఆక‌ట్టుకుంది. గీతిక‌కు బాగా చ‌దువుకోవాల‌ని ఆశ ఉందని.. అందుకు పేద‌రికంగా అడ్డుగా మారింద‌ని పేర్కొంటున్నారు. ఎవ‌రైనా దాత‌లు ముందుకు వ‌చ్చి సాయం అందిస్తే.. తాను ఇంట‌ర్, డిగ్రీ చ‌దువుకుంటాన‌ని మ‌రింత భాషా నైపుణ్యం పెంచుకొని పుస్త‌కాలు రాస్తాను అంటుంది గీతిక‌. GEETHIKA VEDHANA BOOK

Also Read : BALKA SUMAN : బాల్క సుమ‌న్ కి బెయిల్.. కానీ ఆ ష‌ర‌తులు పాటించాల్సిందే..!