Wedding Card Viral: చంద్రబాబు దంపతుల ఆశీస్సులతో బండ్ల గణేష్ కూతురు.. పెళ్లి కార్డు వైరల్!!

సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూతురు పెళ్లి కార్డు వైరల్ అయింది. ఈ వివాహ ఆహ్వాన పత్రికపై చంద్రబాబు దంపతుల ఆశీస్సులతో అని ముద్రించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. బండ్ల గణేష్ కుమార్తె జనని వివాహం ఆగస్టు 16న హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. వరుడు సూర్య తేజ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినవాడు.

బండ్ల గణేష్ తన కుమార్తె పెళ్లి ఏర్పాట్లలో భాగంగా మొదట తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల వద్ద ఆహ్వాన పత్రిక సమర్పించారు. ఆ తర్వాత రెండో పత్రికను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు వారి సతీమణి నారా భువనేశ్వరికి స్వయంగా అందించారు. ఈ కార్డుపై శ్రీమతి నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో అని ప్రత్యేకంగా ముద్రించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్కు వీరాభిమానిగా పేరుపొందినా, తన కూతురి పెళ్లి కార్డుపై పవన్ పేరు లేకుండా చంద్రబాబు దంపతుల పేర్లు మాత్రమే ఉండడంపై అభిమానుల్లో చర్చ మొదలైంది. కొందరు పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతుండగా, మరికొందరు బండ్ల గణేష్కు నారా కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాలే దీనికి కారణమంటున్నారు. ఈ వివాహ ఆహ్వాన పత్రిక ఫొటోలు ఇప్పుడు ఫేస్బుక్, వాట్సాప్లలో వైరల్గా మారాయి.

గతంలో బండ్ల గణేష్ చంద్రబాబు నాయుడు కుటుంబంపై తన అభిమానాన్ని చాలా సందర్భాల్లో బహిరంగంగా వ్యక్తం చేశారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలై తిరిగి ముఖ్యమంత్రి కావాలని తిరుమల స్వామివారిని మొక్కుకుని, ఆ కోరిక నెరవేరిన తర్వాత కాలినడకన తిరుమల వెళ్లి మొక్కు తీర్చుకున్న విషయం తెలిసిందే. అలాగే నారా భువనేశ్వరి పుట్టినరోజున అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడికి రూ.5 లక్షలు సహాయంగా అందించి తన ప్రేమను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో వివాహ ఆహ్వాన పత్రికలో చంద్రబాబు దంపతుల ఆశీస్సులు ఉండడం సహజంగానే కనిపిస్తోంది.

Share your love