Eat Sprouts: మొలకలు విపరీతంగా తింటున్నారా.. అయితే జాగ్రత్త ?
Eat Sprouts: మొలకలు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని ఇందులో ఉంటాయి. ప్రతిరోజు మొలకలు తినడం బాగా అలవాటు చేసుకోవాలని వైద్యులు చెబుతూనే ఉంటారు. అందులో ముఖ్యంగా పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారు చేసిన మొలకలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెసరపప్పు మొక్కల ఆధారిత ప్రోటీన్స్ కి పవర్ హౌస్ గా పరిగణించబడుతుంది. మొలకలలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, బీ కాంప్లెక్స్, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు పెసర మొలకలు తినడం మంచిది.

Best Time To Eat Sprouts for human
వీటిని రోజూ తిన్నట్లయితే శరీరంలో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. మొలకలను 21 రోజుల పాటు క్రమం తప్పకుండా తిన్నట్లయితే కండరాలు బలంగా తయారవుతాయి. దీని వినియోగం వల్ల ఎముకలు కూడా బలంగా మారుతాయి. కండరాలతో పాటు కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల పెసరపప్పు చాలా మంచిది. వీటిని తిన్నట్లయితే బరువు అదుపులో ఉంటారు. కండరాలను బలంగా తయారు చేయడంలో మొలకలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. మొలకలు తినడం వల్ల చర్మానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది. మొలకలు తినడం వల్ల రోజంతా చురుగ్గా ఉండడానికి శరీరం సహకరిస్తుంది.
Also Read: Sugar Cane Juice: వేసవిలో చెరుకు రసం తాగుతున్నారా..అయితే ఇవి తెలుకోండి ?
మొలకలలో యూరికి యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రోటీన్ సమస్యలను పెంచుతుంది. జీర్ణ సమస్యలు ఉన్నట్లయితే మొలకలు ఉడికించి తినడం చాలా మంచిది. చిన్నపిల్లలకు కూడా మొలకలను స్నాక్ రూపంలో తినిపించినట్లైతే వారి శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. వారి ఎదుగుదల బాగుంటుంది. చురుగ్గా, ఆరోగ్యంగా తయారవుతారు. మెదడు పనితీరు సక్రమంగా ఉంటుంది. మరి ఎదుగుదలను ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉంటారు. అయితే మొలకలను కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అసలు వీటిని తీసుకోకూడదు. గ్యాస్, అల్సర్ సమస్యలు ఉన్నవారు వీటిని అస్సలు తినకూడదు. ఈ సమస్యలతో బాధపడేవారు మొలకలను తిన్నట్లయితే వారికి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దానివల్ల గ్యాస్, అల్సర్ సమస్యలు మరింత ఎక్కువవుతాయి.
Also Read: Raisins Benefits: ఎండు ద్రాక్షతో ఇలా చేస్తే… అద్భుత ఫలితాలు ?