
Chiranjeevi: ఏంటి చిరంజీవి కూతురు వయసున్న అమ్మాయితో అలాంటి పని చేస్తున్నారా.. అసలు మైండ్ పనిచేస్తుందా.. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు అని చాలామంది ఈ విషయం తెలిస్తే చిరంజీవిపై విమర్శలు చేస్తారు. ఇక చిరంజీవి కూతురు వయసున్న అమ్మాయితో చేసే పని ఏంటి అంటే నెక్స్ట్ మూవీ.. చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి తో శివశంకర వరప్రసాద్ గారు అనే సినిమా చేస్తున్నారు.
Chiranjeevi doing such a thing with a girl of his daughter age
ఈ సినిమా తర్వాత మళ్లీ వాల్తేరు వీరయ్య మూవీ కాంబో రిపీట్ చేయబోతున్నారు. డైరెక్టర్ బాబీ తో తన 158 వ సినిమా చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చిరంజీవి సరసన ప్రభాస్ రాజా సాబ్ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న మాళవిక మోహనన్ నటించబోతున్నట్టు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.(Chiranjeevi)
Also Read: Rana: భార్య ప్రెగ్నెన్సీని దాచిన రానా.. వైరలవుతున్న మిహికా బేబీ బంప్ వీడియో.!
అయితే ఈ రూమర్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ అసలు చిరంజీవి తన వయసుకు తగ్గ హీరోయిన్లతో సినిమాలు చేయాలి కానీ ఇలా కూతురు వయసు ఉన్న మనవరాలు వయసున్న హీరోయిన్లతో సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది.. అబ్బే అస్సలు బాగుండదు.. ఒకవేళ మాళవిక మోహనన్ ని ఫిక్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా చిరంజీవికి విమర్శలు తప్పవు.

ముందే ఈ విమర్శలను ఊహించి చిరంజీవి తన వయసుకు తగ్గ హీరోయిన్ ని సెట్ చేసుకోవడం మంచిది అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే చాలా రోజుల నుండి చిరంజీవి చేసే సినిమాల్లో హీరోయిన్స్ ఏజ్ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఇప్పటికే తమన్నా, కాజల్,శృతిహాసన్ వంటి తనకంటే వయసులో చిన్న హీరోయిన్లతో రొమాన్స్ చేసి విమర్శల పాలయ్యారు.(Chiranjeevi)





