Group-I: గ్రూప్ 1 ఉద్యోగం కోసం 3 కోట్లు అడిగిన కాంగ్రెస్ మంత్రి ?

Group-I

Group-I: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రూప్ వన్ ఉద్యోగాల చుట్టూ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత హైకోర్టు బ్రేక్.. వేసింది. గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ సరిగా జరగలేదని… కొన్ని అవకతవకలు జరిగాయని… గులాబీ పార్టీతో పాటు నిరుద్యోగులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి… తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. Group-I

Also Read: Extramarital Affairs: విపరీతంగా పెరుగుతున్న వివాహేతర సంబంధాలు.. అదే ప్రధాన కారణం!!

Congress minister asks for Rs 3 crore for Group 1 job

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇస్తూ… గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలను నిలిపివేయడమే కాకుండా మళ్లీ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణ నేపథ్యంలో… పరీక్షను రద్దు చేసింది. దీంతో నిరుద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే… ఓ గ్రూప్స్ రాసిన ఓ అభ్యర్థి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నాయని.. గ్రూపు వారిని ఉద్యోగం కోసం మూడు కోట్లు కాంగ్రెస్ మంత్రి అడిగినట్లు బాంబు పేల్చాడు సదరు అభ్యర్థి. ఓ టీవీ డిబెట్ లోనే ఈ వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ కలెక్టర్ పదవి కోసం… ఒక 3 కోట్లు ఖర్చు అవుతుందని… కాంగ్రెస్ మంత్రి లంచం అడిగినట్లు… టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్లో పేర్కొన్నాడు. Group-I

Also Read: Tablets: టాబ్లెట్లను విరిచి వేసుకుంటున్నారా…అయితే డేంజ‌ర్ లో ప‌డ్డ‌ట్టే!

ఒక ట్రాన్స్ఫర్ కి 30 లక్షలు తీసుకుంటాం… అలాంటిది డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అంటే కచ్చితంగా మూడు కోట్లు ఖర్చు అవుతుందని తెలిపాడట. దీంతో నిరుద్యోగి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఆ కాంగ్రెస్ మంత్రి ఎవరు అనే దాని పైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇక దీనిపై గులాబీ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కాంగ్రెస్ మంత్రి ఎవరు అనే దాని పైన సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై సిబిఐ ఎంక్వయిరీ చేస్తేనే… కుట్ర బయటపడుతుందని తెలిపారు. Group-I

Also Read: vegetarians: అత్యధిక శాకాహారులు ఉన్న టాప్ దేశాలివే.. పెరుగుతున్న వెజిటేరియన్స్!!

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu