Congress: తెలంగాణలో మరో రెండు మంత్రి పదవులు.. ఎవరికి ఛాన్స్ అంటే ?

Congress

Congress: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టే రాజకీయాలు కొనసాగుతున్నాయి. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 14వ తేదీన రిజల్ట్ ప్రకటిస్తారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ఆజరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం ఏంటని ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది భారతీయ జనతా పార్టీ. Congress

Congress Two more ministerial posts in Telangana

అయితే అజారుద్దీన్ బ్యాటింగ్ చేసినా కూడా ఓడిపోతుందని గులాబీ పార్టీ ఈ మంత్రి పదవి అంశంపై స్పందించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడాన్ని సమర్థించారు. టీమిండియా కు ఎన్నో సేవలు అందించిన అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే తప్పేంటి అని నిలదీశారు. డిసెంబర్ మాసంలో మరో రెండు మంత్రి పదవులను భర్తీ చేస్తామని కూడా వెల్లడించారు. Congress

Also Read: Azharuddin: అజారుద్దీన్ కు మంత్రి పదవి..4 గురు కాంగ్రెస్ నాయకుల తిరుగుబాటు ?

దీంతో ఆ ఇద్దరు ఎవరు అనే దాని పైన చర్చ జరుగుతోంది. ఇందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుందని కొంతమంది అంచనా వేస్తున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పదవి ఇస్తే, ఉత్తంకుమార్ రెడ్డి తిరుగుబాటు చేసే ప్రమాదం పొంచి ఉంది. ఆయన భార్యకు కూడా మంత్రి పదవి అడుగుతున్నారు. ఇప్పటికే మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి భార్య పలుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అందుకే ఆమె కూడా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇటు ఉమ్మడి కరీంనగర్ లో మరొకరికి మంత్రి పదవి వస్తుందని చెబుతున్నారు. మరి ఆ రెండు మంత్రి పదవులు ఎవరికి దక్కుతాయో చూడాలి. Congress

Also Read: Fenugreek Seeds: మెంతులు అని తీసిపారేస్తున్నారా..నీటిలో వేసుకొని తాగితే ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu