
Womens World Cup 2025: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఫైనల్ లో దక్షిణాఫ్రికా అలాగే టీమ్ ఇండియా తలపడనున్నాయి. నవంబర్ రెండో తేదీ అంటే ఆదివారం రోజున ఈ రెండు జట్ల మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. Womens World Cup 2025
Womens World Cup 2025 India Women vs South Africa Women, Final
ముంబై లో ఈ మ్యాచ్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రోజున కూడా తొలకరి జల్లులు పడే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ రోజు భారీ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే… విజేత ఎవరు అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. అయితే ఫైనల్ మ్యాచ్కు రిజర్వుడే ఉంది. Womens World Cup 2025
Also Read: Fenugreek Seeds: మెంతులు అని తీసిపారేస్తున్నారా..నీటిలో వేసుకొని తాగితే ?
కాబట్టి సోమవారం రోజున మ్యాచ్ మళ్లీ నిర్వహిస్తారు. ఆదివారం ఎక్కడ వరకు పూర్తయిందో అక్కడి నుంచి ప్రారంభం చేస్తారు. ఇక రిజర్వుడే అంటే సోమవారం రోజు కూడా మ్యాచ్ జరగకపోతే దక్షిణాఫ్రికా ఛాంపియన్ అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఎందుకంటే పాయింట్లు పట్టికలో మూడో స్థానంలో దక్షిణాఫ్రికా ఉండగా నాలుగో స్థానంలో టీమిండియా ఉంది. ఇదే టీమ్ ఇండియా కొంప ముంచేలా కనిపిస్తోంది. కాబట్టి వర్షం పడకుండా ఉండాలని టీమిండియా అభిమానులు భగవంతున్నీ కోరుతున్నారు. Womens World Cup 2025
Also Read: Azharuddin: అజారుద్దీన్ కు మంత్రి పదవి..4 గురు కాంగ్రెస్ నాయకుల తిరుగుబాటు ?




















