Dhanush Political: తమిళనాడు రాజకీయాల్లోకి హీరో ధనుష్ వస్తున్నారా.. టీవీకే నేత కీలక కామెంట్స్ ఏంటి?

Dhanush political

తమిళనాడు రాజకీయ రంగప్రవేశానికి సంబంధించి ప్రముఖ సినీ నటుడు ధనుష్‌పై చెన్నైలో గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. హీరో ధనుష్ ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, దానిని ఎన్నికల సంఘంలో నమోదు చేశారంటూ తమిళనాట పెద్దఎత్తున వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్ చెన్నైలో ఈ అంశంపై స్పందిస్తూ కీలక ప్రకటన చేశారు.

Dhanush Political Entry Speculation Grows

తమిళనాడు రాజకీయాల్లోకి సినీ పరిశ్రమ నుంచి ప్రముఖులు అడుగుపెట్టడం కొత్తేమీ కాదని, గతంలో సీఎన్ అన్నాదురై, ఎం. కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలితతో పాటు ఇటీవలి కాలంలో విజయ్ వంటి ప్రముఖులు రాజకీయ రంగంలోకి వచ్చి కీలక పాత్రలు పోషించారని పరిశీలకులు గుర్తుచేస్తున్నారు. శివాజి గణేశన్, విజయకాంత్, శరత్ కుమార్, కమల్ హాసన్ వంటి నటులు సైతం గతంలో రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ, ధనుష్ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ఊహాగానాలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ధనుష్ ఇప్పటివరకు తన రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఆయన ఇటీవల కాలంలో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటం ఈ చర్చలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. కొన్ని నెలలుగా తన అభిమాన సంఘాల ద్వారా క్షేత్ర స్థాయిలో సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ముమ్మరం చేయడమే కాకుండా, అభిమాన సంఘం తమకంటూ ప్రత్యేకంగా రెడ్, వైట్ కలర్స్ జెండాను ఆవిష్కరించడం ఆయన రాజకీయ ప్రవేశానికి బలమైన పునాదులు వేస్తున్నారనే వాదనకు కారణమైంది.

ఈ పరిణామాలపై స్పందించిన టీవీకే అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్ మాట్లాడుతూ, ఎవరైనా రాజకీయాల్లోకి రావొచ్చని, ధనుష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తమ పార్టీ తరఫున స్వాగతిస్తామని స్పష్టం చేశారు. విజయ్ హీరోగా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే సినిమాలను పక్కనపెట్టి రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించారని, రాజకీయ పార్టీని స్థాపించడం ఒక ఎత్తయితే దానిని నిలబెట్టి అధికారంలోకి తీసుకురావడం మరో ఎత్తని ఆయన పేర్కొన్నారు.

మరింత అప్‌డేట్స్ కోసం: ఇక్కడ చూడండి

Leave a Comment