తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయ రంగప్రవేశం గురించి మళ్లీ సంచలనం మొదలైంది. ఈసారి ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. కేవలం ఫ్యాన్ షోలు, సినిమా వేడుకలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే పనుల్లో అభిమానులు పాల్గొనాలని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో ధనుష్ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడతారనే speculation మరింత ఎక్కువైంది.
Dhanush Rajanikanth political entry hints
రీసెంట్గా ఓ పబ్లిక్ ఈవెంట్లో మాట్లాడిన ధనుష్, తన అభిమానులకు ఓ కొత్త దిశను చూపించారు. ఇంతమంది ఒకే చోట కలవడం వల్ల వచ్చే శక్తిని మంచి కోసం వాడాలి అని ఆయన అన్నారు. ఆడియో లాంచ్‌లు, ఫ్యాన్ మీట్లతో ఆగిపోకండి. మీ ప్రాంతంలో ఎవరికైనా సాయం చేయండి. మీ పనులు చూసి నేను గర్వపడేలా చేయండి అంటూ అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ మాటలు చాలా మందికి ధనుష్ రాజకీయ ప్రవేశానికి సంకేతంగా కనిపిస్తున్నాయి.
ఇటీవల తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో, ధనుష్ కూడా అదే దారిలో నడుస్తారా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయాన్ని హాట్ టాపిక్‌గా మార్చేశారు. కొంతమంది అభిమానులు ఆయన వ్యాఖ్యలను భవిష్యత్ ప్లాన్లకు సంకేతంగా భావిస్తే, మరికొందరు సమాజ సేవపై అవగాహన కోసమే ఆయన ఇలా అన్నారని అంటున్నారు.
ప్రస్తుతం ధనుష్ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన రాజకీయాలపై ఇప్పటివరకు అధికారికంగా ఏ ప్రకటనా రాలేదు. అభిమానుల ఊహాగానాలు, సోషల్ మీడియా చర్చలతోనే ఈ విషయం నిలిచిపోయింది. ధనుష్ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని పిలుపు ఇచ్చిన తీరు మాత్రం అందరి నుంచి ప్రశంసలు అందుకుంటోంది. అసలు విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.





