NEET పేపర్ లీక్ కేసులో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్పై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. రాజధాని ఢిల్లీలో మొదలైన ఈ ఆందోళన ఇప్పుడు దేశమంతా విస్తరించింది. ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షలో పేపర్ లీక్ అవడం, రెండోసారి నిర్వహించినా సరైన పారదర్శకత లేకపోవడంతో విద్యార్థులు ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా కోసం పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆవేదన అర్థం కావడం లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
NEET Paper Leak Protest Explained
ప్రస్తుతం ధర్మేంద్ర ప్రదాన్ పై ఎదురవుతున్న ఈ విమర్శలు ఆయన గతాన్ని గుర్తు చేస్తున్నాయి. 1997లో ఒడిశాలో విద్యార్థి నాయకుడిగా ఉన్న ప్రదాన్, అప్పటి ఓ పేపర్ లీక్ ఘటనపై భువనేశ్వర్ సచివాలయం ఎదుట పెద్ద నిరసన చేసిన సంగతి తెలిసిందే. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అప్పట్లో డిమాండ్ చేశారు. ఇప్పుడు అదే పేపర్ లీక్ విషయంలో ఆయనే విమర్శల లక్ష్యంగా నిలిచారు. ఈ ఐరనీ విద్యార్థులకు కోపం తెప్పించడంతో పాటు ప్రదాన్ పై నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయేలా చేసింది.
విద్యార్థులు ప్రదాన్ ను ఇంతటి తీవ్రంగా వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇదే. గతంలో పేపర్ లీక్ కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఇప్పుడు అదే కేసులో కేంద్రంగా నిలవడం విడ్డూరం. NEET పరీక్షలో జరిగిన పేపర్ లీక్ కు సంబంధం తనకు లేదంటూ ప్రదాన్ బుధవారం నాడు స్పష్టం చేశారు. అయితే విద్యార్థులు ఈ వాదనను అంగీకరించడం లేదు. వారి ప్రకారం, ఇంత పెద్ద స్థాయిలో పేపర్ లీక్ జరగడానికి ఆయన పరిశీలనలో లోపాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుత స్థితిలో ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేస్తారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో విద్యార్థి నాయకుడిగా చేసిన నిరసనలను నేడు ఆయనే ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. నిరంతరం విద్యార్థి సంఘాల నుండి వచ్చే డిమాండ్లు పెరుగుతుండడంతో, ప్రదాన్ ఏ నిర్ణయం తీసుకుంటారనేదే ఇప్పుడు ప్రధాన అంశం. ఎలాంటి పరిస్థితిలో ఆయన రాజీనామా చేస్తారా లేదా పాత వాదనలే కొనసాగిస్తారా చూడాల్సి ఉంది. అంతవరకు విద్యార్థుల నిరసనలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.





