కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రమోట్ చేస్తున్న E20 petrol పై ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడు విజయకృష్ణ నరేష్ కుండబద్దలు కొట్టారు. ఆయన తన సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ petrol వల్ల వాహనాల మైలేజీ దారుణంగా పడిపోతోందని, హై ఎండ్ కార్లకు పెద్ద మొత్తంలో ఖర్చు వస్తోందని అన్నారు. ఇప్పటికే ఈ విషయంపై చాలా మంది యూజర్లు తమ అనుభవాలు షేర్ చేస్తుండగా, ఇప్పుడు ఓ సినీ సెలబ్రిటీ స్పందించడం హాట్ టాపిక్‌గా మారింది.
E20 petrol problems for high-end cars
తన వద్ద రూ.2 కోట్ల పోర్షే కారు ఉందని, అందులో E20 petrol వాడడం వల్ల ఇంజన్ సమస్యలు వచ్చాయని నరేష్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ, నేను యాంటీ నేషనల్ కాదు, కానీ ఈ ఇథనాల్ పెట్రోల్ బైక్‌లే కాదు, హై ఎండ్ కార్లకు కూడా గుండెపోటు తెప్పిస్తోంది అని అన్నారు. బీజేపీ మద్దతుదారు అయిన తన స్నేహితుడి టయోటా కార్ వాల్వులు పాడైపోయి రూ.3.5 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. పోర్షే కార్ వాల్వులు మార్చాల్సి వస్తే రూ.12 లక్షల వరకు ఖర్చవుతుందని హెచ్చరించారు.
దీంతో తాను ప్రస్తుతం లీటరు రూ.165 ధర ఉన్న హై ఆక్టేన్ పెట్రోల్ వాడాల్సి వస్తోందని నరేష్ వివరించారు. సాధారణ బైక్ యూజర్లు, మిడిల్ క్లాస్ వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పర్యావరణం కోసం E20 petrol తీసుకురావడం మంచి ఆలోచనే, కానీ ఇది తొందరపాటు నిర్ణయమని, ప్రజలకు పెద్ద ఇబ్బంది తెచ్చిపెడుతోందని నరేష్ విమర్శించారు.
తాను బీజేపీ మాజీ నాయకుడినని గుర్తు చేసిన నరేష్, తన అనుభవాన్ని పార్టీ నాయకులకు కూడా షేర్ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని, ఈ సమస్య వల్ల కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన సూచించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా, యూజర్లు తమ అభిప్రాయాలు షేర్ చేస్తున్నారు.





