Horoscope For 10th November 2023

మేషం: దూరపు బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన వాటిని వింటారు. చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థికపరంగా కొంతమేరకు అనుకూలిస్తుంది. ఉద్యోగ విషయాలలో చర్చలు సఫలం అవుతాయి.

వృషభం: ఇతరులతో ఊహించని విధంగా వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటను లెక్కచేయరు. ఆరోగ్య విషయంలో వైద్యులను సంప్రదించడం అవసరం .వృద్ధి ఉద్యోగాలలో ఒత్తిడి పెరుగుతుంది.

మిధునం: శారీరక మానసిక అనారోగ్య సమస్యలు సైతం వెంటాడుతాయి. మాతృ వర్గ బంధువులతో పట్టింపులు ఉంటాయి. అప్పుల బాధ నుంచి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు అడ్డంకులు ఏర్పడతాయి. వ్యాపారాలలో మిశ్రమంగా ఫలితం ఉంటుంది.

కర్కాటకం: కొత్త వస్త్రాలను కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి అనుకూలత లభిస్తుంది. మీరు నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగానే ఉంటాయి. నిరుద్యోగులకు వృత్తి వ్యాపారులకు సహజంగానే సాగుతుంది.

సింహం: ప్రారంభించిన పనులు నెమ్మదిగా నిలిచిపోతాయి. ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఇంట బయట ఎన్నో సమస్యలు చికాకును తెప్పిస్తాయి. వ్యాపారాలలో సొంత ఆలోచన మంచిది.

కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంట బయట సమస్యలు ఉన్నప్పటికీ పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలను మించి లాభాలను పొందుతారు. ఉద్యోగమున అధికారులతో మాట్లాడే టప్పుడు కాస్త వినయంగా ఉండడం మంచిది.

Horoscope For 10th November 2023

తుల: కీలక వ్యవహారాలలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశనే మిగులుస్తాయి. తొందరపడి మాట ఇవ్వడం మంచిది కాదు.

వృశ్చికం: ధనం వచ్చే మార్గాలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో పలు సమస్యల నుంచి బయటపడతారు. అప్పులను సైతం తీర్చేస్తారు.విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మానసిక ప్రతాంతత లభిస్తుంది.

ధనస్సు: చుట్టాలతో ఆస్తి వివాదాలు మొదలవుతాయి. ఉద్యోగులు ప్రమోషన్స్ ని పొందుతారు. అనుకోకుండా లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి.

మకరం: సంఘంలో కీర్తి ప్రతిష్టలు సైతం పెరుగుతాయి. ఇంటి నిర్మాణ పనులు చేపడుతారు. వృత్తి వ్యాపారాలలో లాభాలను పొందుతారు సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఆర్థికంగా అన్ని సహకరిస్తాయి.

Also Read: Health: ప్రతిరోజు మాట్లాడకుండా ఆ పని చేస్తే ఆరోగ్యానికి ఎన్ని లాభాలో తెలుసా..?

కుంభం: అనుకున్న సమయానికి అనుకున్న పని జరగక ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడమే మంచిది. ధన విషయంలో ఎవరికీ మాట ఇవ్వకూడదు.

మీనం: కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తని అందుకుంటారు. నూతన వాహనం కొంటారు. బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా సమయానికి పూర్తి అవుతాయి ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారు.(Horoscope)

Join WhatsApp