తెలంగాణ ప్రభుత్వం family register certificate ను రేషన్ కార్డుతో అనుసంధానిస్తూ పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం వల్ల ప్రజలకు చాలా సౌకర్యాలు దొరుకుతాయని అధికారులు చెబుతున్నారు. ఇకపై కుటుంబ సభ్యులందరి వివరాలు, ఆధార్ నంబర్లు, ఫోన్ నంబర్లు వంటివన్నీ ఒకే దగ్గర దొరికేలా ఈ సర్టిఫికేట్ తో జరుగుతుంది.
Telangana Family Register Certificate New Rules
ఈ family register certificate వల్ల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ ఈ సర్టిఫికేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీని ద్వారా ప్రభుత్వ పథకాలకు అప్లై చేసేటప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు వంటి చాలా పేపర్లు చూపించాల్సిన అవసరం తగ్గుతుంది. సర్టిఫికేట్ లో కుటుంబంలో అందరి details ఉండడం వల్ల సంక్షేమ పథకాలు త్వరగా మనకి అందుతాయి.
ఇంకా ఈ సర్టిఫికేట్ ఉద్యోగాలకి, విద్యకి, ఆరోగ్య రంగానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్రభుత్వం ఈ కొత్త system ని అమల్లోకి తెచ్చాక ప్రజలు రేషన్ కార్డు కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఆన్లైన్లో కూర్చుని చాలా తేలిగ్గా అప్లై చేసుకోవచ్చు. ఇంటి దగ్గరే అన్ని చేసుకునే వీలుంటుంది.
తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం ద్వారా పాలనను మరింత పారదర్శకంగా, ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. ఈ కొత్త విధానం వల్ల అన్ని వర్గాల ప్రజలకు సమానంగా లబ్ధి చేకూరుతుంది. ఇక ఎవరికీ ఎదురుచూపులు లేకుండా ప్రభుత్వ సదుపాయాలను వాడుకునే వీలుంటుంది.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848




