Gold Price: గోల్డ్ ధరలు దిగొచ్చిన వేళ కొనుక్కోవచ్చా

gold-price-today-hyderabad-silver

ప్రస్తుతం మార్కెట్‌లో Gold Price భారీగా పెరుగుతూ వస్తోంది. అమెరికా – ఇరాన్ మధ్య టెన్షన్స్ పెరుగుతుండటంతో పాటు, గ్లోబల్ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు దూసుకుపోతున్నాయి. అయితే రీసెంట్‌గా చిన్నపాటి కరెక్షన్ కనిపించడంతో, గోల్డ్ లవర్స్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది. పడిపోయిన ఈ గోల్డ్ రేట్లను చూసి ఇప్పుడు బంగారం కొనుగోలు చేయవచ్చా లేదా అని చాలామంది ఆలోచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్‌డేట్స్ చూస్తే, ఇన్వెస్టర్లు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇదేరైట్ టైమ్ అని భావిస్తున్నారు.

Today Latest Gold Price Trend

అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు ఏకంగా 4,650 డాలర్లకు పైగా ట్రేడ్ అవుతున్నాయి. గత మూడు నెలల గరిష్ట స్థాయికి బులియన్ మార్కెట్ చేరుకోవడంతో దేశీయ మార్కెట్లపై కూడా దీని ప్రభావం పడింది. మన దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 1.64 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. యుఎస్ డాలర్ బలపడటంతో MCX మార్కెట్‌లో గోల్డ్ రేటు స్వల్పంగా తగ్గినా, ఇయర్-ఓవర్-ఇయర్ (y-o-y) ప్రాతిపదికన చూస్తే మాత్రం పసిడి ధరలు ఏకంగా 15 శాతం వరకు లాభపడ్డాయి.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి ప్రధాన నగరాలతో పాటు చెన్నైలో కూడా పసిడి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 24K, 22K, అలాగే 18 క్యారెట్ల బంగారం ధరలు ప్రాంతాన్ని బట్టి స్వల్పంగా మారుతున్నాయి. నిపుణుల అంచనా , పసిడి ధరలలో ఇటీవల కనిపించిన ఈ తాత్కాలిక క్షీణత కొనుగోలుదారులకు ఒక మంచి అవకాశంగా మారుతోంది. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో రిటైల్ కస్టమర్లు జ్యూవెల్లరీ షాపుల వైపు మళ్లీ అడుగులు వేస్తున్నారు.

మొత్తానికి స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు, గ్లోబల్ పాలిటిక్స్ గోల్డ్ రేట్లను డిసైడ్ చేస్తున్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునే వారికి బంగారం ఎప్పుడూ బెస్ట్ ఆప్షనే. మార్కెట్ ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ధరలు కొద్దిగా తగ్గినప్పుడే కొనుగోలు చేయడం సేఫ్ అండ్ ప్రాఫిటబుల్ అని ఎక్స్‌పెర్ట్స్ చెబుతున్నారు.

👉 ఇంకా చదవండి: mythri movie: థియేటర్ల కోసం టాలీవుడ్‌లో కొత్త పోటీ

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu