
Telangana: తెలంగాణ పెన్షన్ దారులకు శుభవార్త..రూ.4000 పెన్షన్ పై ప్రకటన వెలువడింది. మార్చి 31 తర్వాత రూ.4,000 పెన్షన్, మహిళలకు రూ.2,500 ఇస్తాము అంటూ సంచలన ప్రకటన చేశారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. అయితే, దీనిపై గులాబీ పార్టీ ట్రోలింగ్ చేస్తోంది. Telangana
Good news for Telangana pensioners Announcement on Rs.4000 pension
రూ. 4000 పెన్షన్ ఏమైంది ? అసెంబ్లీ ఎన్నికల్లో రూ. 2000 పెన్షన్ని రూ. 4000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని చురకలు అంటిస్తోంది గులాబీ పార్టీ. ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చిన అదే రూ. 2000 పెన్షన్ కొనసాగిస్తు వస్తోంది కాంగ్రెస్ సర్కార్. మున్సిపల్ ఎన్నికల వేళ పెన్షన్ పెంపుపై నిలదీస్తున్నారట వృద్ధులు, వితంతువులు. రెండేళ్ళైనా పైసా పెరగని పెన్షన్, మాట ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. Telangana
Also Read: Harish Rao: కేసీఆర్ జాతిపిత.. రేవంత్ రెడ్డి బూతుపిత
పక్క రాష్ట్రం ఆంధ్రాలో హామీ ప్రకారం రూ. 4000 పెన్షన్ టీడీపీ ప్రభుత్వం ఇస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ఏర్పడ్డాక రూ. 200 పెన్షన్ని రూ. 1000కి పెంచిన కేసీఆర్ ప్రభుత్వం, ఆ తర్వాత రూ.2000లకు చేర్చారు. రూ. 2000 పెన్షన్ని డబుల్ చేస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు, ఇప్పటికీ సప్పుడు లేదని గులాబీ పార్టీ కౌంటర్ ఇస్తోంది. Telangana
Also Read: Jeevan Reddy: కరీంనగర్ కు రేవంత్ రెడ్డి.. జీవన్ రెడ్డి ఘోర అవమానం ?





