
Harish Rao: కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత.. రేవంత్ రెడ్డి బూతుపిత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. 70 ఏండ్ల కేసీఆర్‌ను పట్టుకొని అహంకారంతో “రా” అని సంబోధిస్తూ.. సీఎం హోదాలో వెలమల మీద దిగజారుడు వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. Harish Rao
Telangana Harish Rao slams revanth reddy
రేవంత్ రెడ్డి హార్వర్డ్ పోయినా, అంతరిక్షం పోయినా కుక్క తోక వంకర లెక్క అంటూ నిప్పులు చెరిగారు. ఆ నోట్లో నుండి బూతులు తప్ప ఇంకేమైనా వస్తాయా? అంటూ ఆగ్రహించారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందుకు రైతుబంధు వెయ్యలేనని రేవంత్ రెడ్డి అంటున్నాడని ఫైర్ అయ్యారు. Harish Rao
Also Read: Telangana: తెలంగాణలోకి ఆంధ్రా ఉద్యోగులు..మళ్లీ దోపిడీ షురూ ?
కరోనా సమయంలో కూడా కేసీఆర్ రైతుబంధు ఆపలేదని తెలిపారు. రైతుబంధు డబ్బులు వేయడానికి మేము అభ్యంతరం తెలపకుండా ఎన్నికల సంఘంకు లేఖ రాస్తామన్నారు మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. ఎగగొట్టిన రెండు రైతుబంధులు, ఇప్పటిది కలిపి మూడు రైతు బంధులు ఇప్పుడే వేయండి అంటూ వ్యాఖ్యానించారు హరీష్ రావు. Harish Rao
Also Read: KCR: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులో కేసీఆర్ షాక్, రేవంత్ స్కెచ్ మాములుగా లేదుగా ?





