Harish Rao: ఒత్తిడితో దిగొచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. దేవాదుల్లో 10 మోటర్లు ఆన్

Harish Rao inspecting water motors

Harish Rao ఒత్తిడితో తెలంగాణ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టులో 10 మోటర్లు ఆన్ చేసింది. రైతుల నుండి వస్తున్న వ్యతిరేకతతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. గతంలో 5 మోటర్లు మాత్రమే నడుస్తుండగా, ఇప్పుడు 9 మోటర్లు ఆన్ చేశారు.

Harish Rao Water Motors

దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు నీరు పోటెత్తింది. ప్రస్తుతం సమ్మక్క సాగర్ ఇన్ ఫ్లో 40,200 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 38,410 క్యూసెక్కులు ఉంది. మొత్తం 1790 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.

కాంగ్రెస్ మంత్రులు ఎనిమిది రోజుల కిందటే మోటార్లు స్టార్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ 10 మోటర్లు పూర్తిగా స్టార్ట్ కాలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 10 మోటర్లు ఆన్ చేసి 22 రిజర్వాయర్లు నింపుతామని చెప్పారు.

రైతులు వీళ్ళ మాటలు నమ్మి నారు మళ్లు పోసుకున్నారు. కానీ ఇప్పుడు నీళ్లు ఇవ్వడం లేదు. హరీష్ రావు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


Source: @TeluguScribe on X

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu