Water: రోజుకు ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి… ఎక్కువ తాగితే ఏమవుతుంది…?

Canva: Water

Water: ఉదయం లేచిన వెంటనే ప్రతి ఒక్కరూ చేసే పని నీటిని తాగడం. నీరు తాగి ఉదయం పనిని ప్రారంభిస్తే ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. కొంతమంది ఎక్కువగా నీరు తాగితే మరి కొంత మంది చాలా తక్కువగా నీరు తాగుతారు. నీరు ఎక్కువగా తాగితేనే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచనలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కొంతమంది నీరు తాగడానికి పెద్దగా ఇష్టపడరు. నీటిని ఎక్కువగా తాగితే తరచుగా యూరిన్ వస్తుందని కొంతమంది భయపడుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో చాలామంది నీరు అస్సలు తాగరు. ఇక ఎలాంటి సమయాలలోనైనా నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పురుషులు రోజుకు 3 లీటర్ల నీటిని తాగాలని పలు అధ్యయనాల్లో వెళ్లడైంది స్త్రీలు 2.5 లీటర్ల నీరు తప్పకుండా తాగాలని వైద్యులు చెబుతున్నారు. Water

How many liters of water should you drink per day

గర్భిణీ స్త్రీలు రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీటిని తాగాలని చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగినట్లయితే మూత్రపిండాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల రక్తంలో సోడియం సాంద్రత ఎక్కువ అవుతుందని వైద్యులు చెబుతున్నారు. నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాలు ఫ్రెష్ గా ఉంటాయి. ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు నీరు నెమ్మది నెమ్మదిగా తాగాలి. వారు ఒకేసారి అధికంగా నీరు తాగినట్లయితే వారి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. బీపీ పేషెంట్లు కూడా గంటలో 0.2 లీటర్ల నీటిని తాగాలి. దానివల్ల వారికి రక్త సరాఫరా సాఫీగా జరుగుతుంది.

Also Read: Jubilee Hills by-election: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత‌ బొంతు రామ్మోహన్.. సరైన

రక్తపోటు గుండె సంబంధ సమస్యలు రాకుండా ఉండవచ్చు. బీపి పేషెంట్లు గంట గంటకు నీటిని తాగడం వల్ల వారి ఆరోగ్యం ఎంతో మెరుగ్గా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు నీరు అధికంగా తాగుతూ ఉండాలి. కానీ ఒకేసారి ఎక్కువ నీటిని కాకుండా గంటలో ఒకసారి నీటిని తాగాలి. మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు నీటిని అధికంగా తాగాలని వైద్యులు చెబుతున్నారు. మూత్రపిండాలలో రాళ్లు ఉన్నవారు రోజులో ఐదు నుంచి ఆరు లీటర్ల నీటిని తాగినట్లయితే వారి మూత్రపిండాలలో ఉన్న రాళ్లు కరిగిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయని పలు అధ్యయనాల్లో వెళ్లడైంది. నీటిని ఎక్కువగా తాగడం వల్ల మూత్రంలో మంట సమస్యలు తొలగిపోతాయి. ఆ కారణంగానే స్త్రీలు, పురుషులు ప్రతిరోజూ అధికంగా నీటిని తాగాలి. దానివల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

Also Read: TDP: టీడీపీ నాయకులకు నకిలీ వీడియో కాల్స్..చంద్రబాబు, దేవినేని ఉమ ఫోటోల‌తో !

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu