
Drinking Water: నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది ఒకేసారి ఎక్కువగా నీరు తాగుతారు మరి కొంతమంది గంటకు ఒకసారి నెమ్మది నెమ్మదిగా నీరు తాగుతూ ఉంటారు. ఎలా అయినా సరే నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది నీరు ఎక్కువగా తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే నీటిని తాగే విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా తాగుతూ ఉంటారు. కొంతమంది కళ్ళు మూసుకొని గడగడా నీటిని తాగేస్తూ ఉంటారు. అయితే ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇది శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి సహాయం చేస్తాయి. Drinking Water
If Drinking Water stagnates, is it dangerous
నీరు తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఉదయం లేవగానే గ్లాసేడు నీళ్లు కచ్చితంగా తాగుతూ ఉంటారు. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి ఏదైనా తిన్న తర్వాత నీటిని తాగుతూ ఉంటారు. అయితే ప్రతిరోజూ మూడు లీటర్ల నీటిని తప్పకుండా తాగాలని వైద్యులు చెబుతున్నారు. దానివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. గంటలో లేదా రెండు గంటలకు ఒకసారి తప్పకుండా ఒక గ్లాసుడు నీటిని తాగుతూ ఉండాలి. అయితే నీటిని గడగడా తాగకూడదని నెమ్మది నెమ్మదిగా తాగాలని వైద్యులు చెబుతున్నారు. ఒకే సమయంలో ఎక్కువ నీటిని తాగడం వల్ల కొన్ని సందర్భాలలో ఉండే వేగం అధికంగా పెరుగుతుంది. Drinking Water
Also Read: Komatireddy Rajgopal Reddy: ఆస్తులు అమ్ముకున్నా.. కాంగ్రెస్ పై రాజగోపాల్ రెడ్డి మరో బాంబ్…
దానివల్ల గుండె సంబంధ సమస్యలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా నిలబడి నీళ్లు తాగడం వల్ల మోకాళ్లపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. మోకాలు దెబ్బతింటాయని నిలబడి నీళ్లు గడగడా తాగకూడదని చెబుతారు. నీరు తాగడం వల్ల అది త్వరగా అన్నవాహిక ద్వారా నేరుగా కడుపులోకి చేరుకుంటుంది. ఇది అజీర్ణం లేదా జీర్ణ సమస్యలను తీసుకువస్తుంది. కాబట్టి నిలబడి గడగడా నీటిని తాగే కన్నా కూర్చొని నెమ్మది నెమ్మదిగా నీటిని తాగాలి. ఇలా తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. Drinking Water
Also Read: ponnam prabhakar: పొన్నం ప్రభాకర్ ఒక్కడుంటే చాలు.. కాంగ్రెస్ రెండు నిమిషాల్లో భూస్థాపితం ?


