Dangerous Don t dip biscuits in tea

Dangerous Don t dip biscuits in tea

TEA : మనం ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా శ్రద్ధ చూపాల్సిన పరిస్థితి నెలకొంది. కలుషిత వాతావరణం అలాగే కల్తీ ఫుడ్ కారణంగా ఈ మధ్యకాలంలో అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి. ఇక ఇప్పుడు టీ లో బిస్కెట్లు వేసుకున్న ప్రమాదమే అని చెబుతున్నారు వైద్యులు. టీ తాగడం అందరికీ ఇష్టం ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుత బిజీ లైఫ్ లో అన్నం కంటే ఎక్కువగా టీ మాత్రమే తాగుతున్నారు.

ఉదయం లేచిన నుంచి రాత్రి పడుకునే సమయానికి దాదాపు ఒక్కొక్కరు 10 టీల వరకు తాగిస్తున్నారు. అది తాగితే ఎనర్జీ వస్తుందని ఫీలింగ్ తో కొంతమంది తాగుతుంటే… మరి కొంతమంది వర్క్ ప్రెషర్ కారణంగా తాగుతున్నారు. అయితే ఒక్కో సమయంలో టీ తాగడం మంచిదే కానీ అతిగా తాగితే ఏదైనా చేదు అవుతుంది. అయితే ఈ టీ తాగేటప్పుడు కొంతమంది బిస్కెట్లు వేసుకొని తాగుతారు.

Health : నీళ్లు అందులో పోసుకొని తాగుతున్నారా.. అయితే పిల్లలు పుట్టడం కష్టమే..?

అయితే ఇలా టీ లో బిస్కెట్లు డిప్ చేసుకొని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బిస్కెట్స్ లో ఎక్కువగా హైడ్రో జనరేటర్ వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది. అది చాయిలో కలిసి మన పొట్టలోకి పోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. అలాగే టీ లో బిస్కెట్లు వేసుకుంటే షుగర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు టీలో బిస్కెట్లు తినడం వల్ల హైపర్ టెన్షన్ పెరిగే అవకాశం ఉంటుందని… దీనివల్ల గుండెపోటు లాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా గ్యాస్ సమస్య వస్తుందని కూడా వెల్లడిస్తున్నారు. అలాగే నాలుక పైన ఉన్న కణాలు మరణిస్తాయట. తద్వారా మనకు భవిష్యత్తులో నాలుకకు సంబంధించిన అనేక వ్యాధులు వస్తాయని కూడా చెబుతున్నారు వైద్యులు. కాబట్టి చాయిలో బిస్కెట్లు వేసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ( TEA )

Join WhatsApp