Health : Keeping a Fridge in the Bedroom – Is a Bad Idea

Health : Keeping a Fridge in the Bedroom – Is a Bad Idea

Health ఒకప్పుడు చాలామంది ధనవంతుల ఇంట్లోనే రిఫ్రిజిరేటర్ అనేది ఉండేది. కానీ ఇప్పుడు పేద, మద్య తరగతి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కనీసం సెకండ్ హ్యాండ్ ఫ్రిడ్జ్ అయినా తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు. ఫ్రిడ్జ్ లేకుండా ఎవరి ఇల్లు కూడా ఖాళీగా ఉండడం లేదు. ఇక ఫ్రిడ్జ్ అందరికీ ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే..

ఎండాకాలంలో ఎక్కువగా నీటిని పెట్టుకోవడం కోసం ఉపయోగిస్తారు.అలాగే ఆహార పదార్థాలు, ఫ్రూట్స్, కూరగాయలు పాడవకుండా ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రెష్ గా ఉంటాయి. అయితే కొంతమంది ఫ్రిడ్జ్ ని కిచెన్లో లేదా కిచెన్ పక్కన పెట్టుకుంటారు. కానీ ఇంకొంతమంది మాత్రం ఈ ఫ్రిడ్జ్ ని బెడ్రూంలోనే పెట్టుకుంటూ ఉంటారు.అయితే బెడ్ రూమ్ లో ఎవరైతే ఈ ఫ్రీడ్జ్ ని పెట్టుకుంటారో వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఫ్రిడ్జ్ బెడ్ రూమ్ లో పెట్టుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read : Health : నీళ్లు అందులో పోసుకొని తాగుతున్నారా.. అయితే పిల్లలు పుట్టడం కష్టమే..?

ప్రస్తుతం ఎన్నో రకాల మోడల్ ఫ్రిడ్జ్ వస్తున్నాయి. ఇక గతంలో అయితే గ్యాస్ ఉన్న ఫ్రిడ్జ్ లు మాత్రమే వచ్చేవి.ఇక వీటిని మనం పడుకునే స్థలంలో పెట్టుకుంటే అప్పుడప్పుడు గ్యాస్ లీక్ అయ్యి ఫ్రిడ్జ్ పాడడం వల్ల పేలే సమస్యలు ఉండేవి.కానీ ఈ మధ్యకాలంలో అలాంటి ఫ్రిడ్జ్ లు ఉండడం లేదు. ఒకవేళ మీ ఇంట్లో గనుక పాతకాలం ఫ్రిడ్జ్ లు ఉంటే దానిని మీ బెడ్ రూమ్ కి దూరంగా పెట్టుకోవడం మంచిది. అయితే బెడ్ రూమ్ లో ఫ్రిడ్జ్ ని పెట్టుకుంటే ఫ్రిడ్జ్ నుండి వచ్చే రేడియేషన్ వల్ల మీ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు వచ్చే ఫ్రిడ్జ్ లలో చాలావరకు మంచి మంచి మెరుగైన ఫ్రిడ్జ్ ఉన్నాయి.

కానీ ఒకప్పటి పాత కాలపు ఫ్రిడ్జ్ అయితే ఎప్పుడు పేలుతాయో కూడా తెలియదు. అలాగే వాటి నుండి రేడియేషన్ కూడా ఎక్కువగా వస్తుంది. అందుకే అలాంటి ఫ్రిడ్జ్ లను బెడ్ రూమ్ లో పెట్టుకోకూడదు అంటారు. అంతేకాకుండా ఫ్రిడ్ లో జ్ ఉండే ఆహార పదార్థాలు వంటివి ఫ్రెష్ గా ఉండడం కోసం ఫ్రిడ్జ్ 24 గంటలు ఆన్ లోనే ఉంటుంది. అందుకే ఎప్పుడు ఫ్రిడ్జ్ సౌండ్ వస్తూనే ఉంటుంది.ఈ కారణం వల్ల నిద్ర డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్ లోపల నుండి వాటర్ రూపంలో లీకైతే ఏం కాదు కానీ గ్యాస్ రూపంలో లీక్ అయితే మాత్రం చాలా ప్రమాదం. అందుకే ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ లను ఎప్పటికప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా టెక్నీషియన్ లతో చూయించుకోవడం మంచిది. అలాగే బెడ్రూంలో వీలైనంతవరకు ఫ్రిడ్జ్ ను పెట్టుకోకపోవడం మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. Health

Click Here to Follow PakkaFilmy in Google News

Join WhatsApp