Hero HF Deluxe: భారీగా తగ్గిన ధర.. ఈ 4 రాష్ట్రాల్లో మాత్రమే ఆఫర్!!

Hero HF Deluxe: హీరో HF డీలక్స్ క్యాన్వాస్ బ్లాక్ బైక్‌పై ధర భారీగా తగ్గింపు.. రూ. 59,999కే కొనుగోలు చేసే ఛాన్స్!

హీరో HF డీలక్స్ బైక్ ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ప్రస్తుతం మార్కెట్లో ఇతర కంపెనీలు ధరలు పెంచుతుంటే, హీరో మాత్రం కస్టమర్లకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ బైక్ ప్రారంభ ధర ఇప్పుడు రూ.59,999గా నిర్ణయించారు. గతంలో ఈ మోడల్ ధర రూ.67,634 వరకు ఉండేది. కంపెనీ రూ.7,635 తగ్గించడంతో లాంచ్ టైంలో ఉన్న ధర కంటే కూడా తక్కువకు లభిస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం నాలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం.

Hero HF Deluxe big price cut

ఈ స్పెషల్ ఆఫర్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాలకు ఈ ఆఫర్ విస్తరించే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. కాబట్టి ఈ నాలుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి ఇది చాలా మంచి అవకాశం. బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ కొనాలనుకునే వారు ఈ ఆఫర్ ని మిస్ కాకండి.

ధర తగ్గించినప్పటికీ ఇంజన్, ఫీచర్లలో ఎలాంటి మార్పు లేదు. అదే 97.2 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కొనసాగుతోంది, ఇది 7.8 PS పవర్, 8.05 Nm టార్క్ ఇస్తుంది. ఫోర్ స్పీడ్ గేర్బాక్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్బర్లు, డ్రమ్ బ్రేకులు వంటి ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. ఈ బైక్ రోజువారీ commute కు చాలా సూటబుల్.

హీరో ఈ ధర తగ్గింపుకు అసలు కారణాన్ని వెల్లడించలేదు. కానీ మార్కెట్ వర్గాలు చెప్పినట్లుగా, ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో పెరుగుతున్న పోటీ దీనికి కారణం. హోండా షైన్ 100, బజాజ్ ప్లాటినా 100, టీవీఎస్ స్పోర్ట్ వంటి బైకుల నుండి పోటీ ఉండడంతో కస్టమర్లను ఆకట్టుకోవడానికి హీరో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫర్ వలన అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu