Nandamuri Deepika: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న నందమూరి వదినమ్మ..?

నందమూరి కుటుంబం నుంచి మరో వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. దివంగత నందమూరి హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ కొన్నేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన భార్య నందమూరి దీపిక ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో ఆమె తన భర్త మరణం తర్వాత కూడా పబ్లిక్‌గా ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో యాక్టీవ్ అవుతూ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

Nandamuri Deepika Political Entry

సుహాసిని కూకట్‌పల్లి నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు దీపిక ఆమె కోసం ప్రచారం చేశారు. అలాగే ఇటీవల తన కొడుకు ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా ఓపెనింగ్‌కి వెళ్లారు. గత రెండు వారాలుగా ఆమె ఇన్‸స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చి టీడీపీ పోస్టర్లతో పోస్టులు పెడుతున్నారు. వాటిలో ఎన్టీఆర్, చంద్రబాబు, హరికృష్ణ ఫోటోలు ఉన్నాయి. ఇలా ఆమె ప్రస్తుతం బయటకు వస్తూ జనాల్లో కలుస్తున్నారు.

నందమూరి జానకిరామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొండకల్ గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌లో చిన్నారులకు కుర్చీలు, డ్రైఫ్రూట్స్ అందించారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ వరుస పోస్టులు చేస్తున్నారు. దీంతో ఈమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే చర్చ మొదలైంది.

ప్రస్తుతం నందమూరి దీపిక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. కానీ ఆమె ప్రస్తుత చర్యలు చూస్తుంటే టీడీపీ కోసం ప్రచారం చేయడం లేదా ప్రత్యక్షంగా పోటీ చేయడం ఏదైనా జరగొచ్చు. ఆమె తన ఇన్‸స్టాగ్రామ్ ఖాతాను తెరిచి రెగ్యులర్ గా పోస్టులు షేర్ చేస్తున్నారు. ఇది మొత్తం రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు దారితీసింది.

Share your love