సుప్రీంకోర్టు హనీమూన్ హత్య కేసులో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ తరం వాళ్లు చిన్న చిన్న ప్రెషర్‌ని కూడా హ్యాండిల్ చేయలేకపోతున్నారని, దాంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. నేటి జనరేషన్‌కు నాలెడ్జ్ పెరిగినా, మెంటల్ స్ట్రెస్‌ని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదని న్యాయమూర్తులు విమర్శించారు.
Honeymoon murder case shocking remarks
సోనమ్ రఘువంశీ బెయిల్ విషయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈమె తన భర్త రాజా రఘువంశీని హనీమూన్ సమయంలో హత్య చేసింది. కోర్టు ఆమె బెయిల్ రద్దు చేసి, మూడు వారాల్లో పోలీసులకు సరెండర్ కావాలని ఆదేశించింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలే ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. సమాజంలో వస్తున్న మార్పులే ఇలాంటి క్రైమ్‌లకు కారణమని వారు అభిప్రాయపడ్డారు.
మనుషుల్లో పేషెన్స్ తగ్గి, చికాకు ఎక్కువైందని ధర్మాసనం వివరించింది. ప్రతి దానికి ఇన్స్టంట్ సొల్యూషన్స్ కావాలనుకుంటున్నారని, సోషల్ మీడియా నేర్పించిన నాలెడ్జ్‌నే నిజమైన జ్ఞానంగా భ్రమిస్తున్నారని వ్యాఖ్యానించారు. మేఘాలయ ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని మెరుగ్గా పరిష్కరించేదని గుర్తుచేశారు.
కోర్టు మెహతా వాదనలతో ఏకీభవించింది. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్లలు ఇతరులతో ఎడ్జెస్ట్ అవ్వడం నేర్చుకుంటారని, డిసపాయింట్‌మెంట్‌ని ఎలా ఓవర్ కమ్ చేయాలో అర్థం చేసుకుంటారని చెప్పారు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలు ఎక్కువైపోయాయి. దాంతో చిన్న విషయాలకే పిల్లలు ఆందోళన చెందుతున్నారు. ఏడుస్తున్న పిల్లలకు సర్దిచెప్పకుండా మొబైల్ గ్యాడ్జెట్లు ఇచ్చేయడం వల్ల వారు భావోద్వేగాలను నేర్చుకోలేకపోతున్నారని సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది.





