Hyderabad Weather: వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే.. వర్షాల్లేవా?

Hyderabad Weather

నవంబర్ 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదని, రాబోయే మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో రాష్ట్రానికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు.

Hyderabad Weather Forecast Dry Conditions

రాష్ట్రవ్యాప్తంగా కనీస ఉష్ణోగ్రతల్లో రాగల రెండు రోజుల వరకు పెద్దగా మార్పులు ఉండవని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నగరంలోని వివిధ ప్రాంతాలైన గచ్చిబౌలి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ వంటి చోట్ల ప్రత్యేకంగా వర్ష సూచన ఏదీ లేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలోని ఏ జిల్లాకు కూడా ఎల్లో, ఆరెంజ్ లేదా రెడ్ అలర్ట్‌లు జారీ చేయకపోవడం గమనార్హం.

మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి ప్రస్తుతం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఇది సోమవారం సాయంత్రానికి తుపానుగా, మంగళవారం నాటికి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. విశాఖపట్నంకు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో ఈ వ్యవస్థ కేంద్రీకృతమై ఉంది.

ఇవి కూడా చదవండి:

ఈ తుపాను పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నెల్లూరు – తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సూచన లేదని స్పష్టమైంది.

మరిన్ని వార్తల కోసం..



చరిత్ర కథలు ఇష్టమా? మా తాజా హిస్టరీ వీడియో చూడండి: రాజులను వణికించిన సాధారణ సైనికుడు

Visited 1 times, 1 visit(s) today