
రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం 95 దాటితేనే సెలవులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ లక్ష్యం పూర్తయ్యే వరకు ఏ రకమైన సెలవు కావాలన్నా అదనపు కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. నవంబర్ 13న వెలువడిన ఈ ఉత్తర్వుల ప్రకారం, హెడ్ మాస్టర్లు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల లోపు హాజరు నివేదికలను ఉన్నతాధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
Telangana Teachers Oppose Attendance Order
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమీక్షా సమావేశంలో హైదరాబాద్ జిల్లాలో హాజరు శాతం అత్యల్పంగా ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా నమోదైన వివరాల ప్రకారం జిల్లాలో హాజరు కేవలం 60 శాతంగానే ఉన్నట్లు సమాచారం. నవంబర్ నెలను ‘ప్రత్యేక హాజరు మాసంగా’ విద్యాశాఖ ప్రకటించి, 100 శాతం హాజరు సాధించాలని అన్ని పాఠశాలలను ఆదేశించింది.
కలెక్టర్ జారీ చేసిన ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సాధారణంగా క్యాజువల్ లీవ్స్ వంటివి నిబంధనల ప్రకారం పొందే హక్కు ఉంటుందని, ఇలా హాజరుతో ముడిపెట్టడం చట్టవిరుద్ధమని వారు వాదిస్తున్నారు. పండుగలు, అయ్యప్ప దీక్షల వంటి కారణాల వల్ల విద్యార్థులు బడులకు రావడం లేదని, దానికి ఉపాధ్యాయులను బాధ్యులను చేయడం సరికాదని హెడ్ మాస్టర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- Telangana: 7 లక్షల కుటుంబాలకు తీరనున్న ఏళ్ల నాటి సమస్య
- Revanth Reddy: ఏడు లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల తాకట్టు పట్టాలు వెనక్కి!
- INDIA Bloc: ఈసీని ప్రశ్నించేందుకు 48 ప్రశ్నలతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విపక్షాలు!
ఐదు రోజులకు పైగా గైర్హాజరైన విద్యార్థుల వివరాలను సేకరించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి బడికి వచ్చేలా చూడాలని విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. నిబంధనలను అతిక్రమించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటెండెన్స్ పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయాలు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
చరిత్ర కథలు ఇష్టమా? మా తాజా హిస్టరీ వీడియో చూడండి: రాజులను వణికించిన సాధారణ సైనికుడు
ప్రశాంత్ – పక్కా ఫిల్మీ తెలుగు ఎడిటర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలుగు సినిమా, క్రీడలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే వార్తలను సులభమైన తెలుగులో అందిస్తారు. ప్రతి వార్త మా ఎడిటోరియల్ పాలసీ ప్రకారం సమాచారం సరిచూసిన తర్వాతే ప్రచురించబడుతుంది. ఫాలో అవ్వండి — X: https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_





