
Kushboo: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ప్రపంచవ్యాప్తంగా పేరున్న హీరో.. ఈయన రీసెంట్ గా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రముఖ పత్రిక 100 సంవత్సరాల లో ఏనాడు లేనిది ఓ హీరో ఫోటోని మొదటి పేజీలో పెద్దగా వేసి సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఆ పేపర్ పై ఏ ఒక్క హీరో ఫోటోని కూడా ఇలా కవర్ పేజీపై వేసింది లేదు. అలాంటి రేర్ ఫీట్ ని రజినీకాంత్ అందుకున్నారు.
Kushboo fire on Rajinikanth fans
ఇదిలా ఉంటే తాజాగా రజినీకాంత్ కమల్ హాసన్ కాంబోలో ఓ సినిమా అనుకున్న సంగతి తెలిసిందే.ఇక ఈ కాంబోలో వచ్చే సినిమాకి డైరెక్షన్ సుందర్ సి చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. కానీ ఆ తర్వాత అందులో నుండి డైరెక్టర్ తప్పుకున్నారు. ఇక సుందర్ సి తప్పుకోవడంతో సుందర్ సి ఫ్యామిలీ పై సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్స్ దారుణమైన కామెంట్లు పెడుతున్నారు.(Kushboo)
Also Read: Balakrishna: “నేను డూప్లికేట్ హీరోని కాదు”.. బాలకృష్ణ సెటైర్లు ఆ హీరో పైనేనా.?
ఇందులో భాగంగా ఒక రజినీకాంత్ అభిమాని ఈ సినిమాలో రజినీకాంత్ కుష్బూని తనతో ఐటెం సాంగ్ చేయమని అడగడం వల్లే సుందర్ సి ఈ సినిమా నుండి తప్పుకున్నట్టు కామెంట్ పెట్టాడు. అయితే ఈ కామెంట్ కుష్బూ వరకు చేరడంతో నన్ను కాదు నీ ఫ్యామిలీ అమ్మాయిని ఐటెం సాంగ్ లో పెడదామని ఆలోచిస్తున్నాం అంటూ కౌంటర్ ఇచ్చింది.

ఆ తర్వాత మరో వ్యక్తి భారతీయ సినీ పరిశ్రమకు సుందర్ సి అవసరం లేదు. ఆయన్ని డస్ట్ బిన్ లో లో పడేసే సమయం వచ్చింది అని కామెంట్ పెట్టాడు. దానికి కుష్బూ నా చెప్పు సైజు 41.. దాని దెబ్బలు తినడానికి నువ్వు రెడీగా ఉండూ అంటూ రిప్లై ఇచ్చింది.దీంతో రజిని అభిమానులకి కుష్బూ ఇచ్చిన రిప్లై సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.దీంతో చాలా మంది నెటిజన్లు ఆకతాయిలకు కుష్బూ చాలా బాగా బుద్ధి చెప్పింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Kushboo)


Kushboo: ‘నీ మొహం కడుక్కో పో’ అంటూ కుష్బూని అవమానించిన కమల్ హాసన్.!