విజయ్ నటించిన ‘జన నాయకన్’ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు షాకింగ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో క్లైమాక్స్ సీక్వెన్స్ ను స్వయంగా దళపతి విజయ్ డైరెక్ట్ చేశారట. హెచ్ వినోథ్ ఈ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నా, పోస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం విజయ్ తనే తీర్చిదిద్దారని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
Jananayagan విజయ్ సీక్వెన్స్
ఈ సీన్ లో లోకేశ్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ లాంటి టాప్ డైరెక్టర్లు విజయ్ పాత్రను వరుస ప్రశ్నలు వేస్తారు. హెచ్ వినోథ్ మాట్లాడుతూ ఇది మొత్తం సినిమాకే హైలెట్ అని hype క్రియేట్ చేశాడు.
జులై 23న థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఇప్పటికే సెన్సార్ ఇబ్బందులతో కొంచెం ఆలస్యమైంది. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైనా, సర్టిఫికెట్ విడుదలలో చిక్కులు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ అడ్డంకులను దాటుకుని థియేటర్లకు రాబోతుంది. పూజా హెగ్డే ఫిమేల్ లీడ్ గా నటిస్తుండగా, మమితా బైజు కీలక పాత్రలో కనిపిస్తుంది. బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి సీనియర్లు కూడా ఇందులో నటిస్తున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్ కు ఇప్పటికే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఆల్రెడీ ట్రెండ్ అవుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కూడా హెచ్ వినోథ్ నే రాశాడు. ఇంతకుముందు ‘ఖాకీ’ సినిమాతో కార్తీకి మంచి పేరు తెచ్చిన ఈ డైరెక్టర్, ఇప్పుడు విజయ్ తో కలిసి పనిచేయడం ఆసక్తికరంగా మారింది.
ప్రేక్షకులను థియేటర్లకు లాగే ఈ సినిమాలోయాక్షన్, ఎమోషన్, సర్ప్రై�్ ఎలిమెంట్స్ ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా విజయ్ డైరెక్ట్ చేసిన సీక్వెన్స్ లో ముగ్గురు డైరెక్టర్లు అడిగే ప్రశ్నలు అభిమానులను థ్రిల్ చేయనున్నాయి. జన నాయకన్ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండటంతో సోషల్ మీడియాలో buzz మరింత పెరిగిపోతుంది. మరి ఈ సినిమా విజయ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందా చూడాలి.





