జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ఊహాగానాలు ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా జులై 18న ఆయన ఒక పెద్ద రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారని, ఫ్యాన్స్ అసోసియేషన్లను ఏకం చేస్తారనే వార్తలు వైరల్ గా మారాయి. ఈ ప్రచారం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ కావడంతో ఇప్పుడు తారక్ టీం దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది.
NTR Political Entry Rumors Clarified
తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి దూకి సక్సెస్ కావడం, అదే టైమ్‌లో గతంలో 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడం, అమిత్ షాతో ఆయనకున్న మీటింగ్‌ల లాంటి పాత ఇన్సిడెంట్స్‌ను మళ్ళీ బయటకు తీసి సోషల్ మీడియాలో మరింత ఊహాగానాలను బలంగా స్ప్రెడ్ చేశారు. నిజానికి ఒక point వచ్చేసరికి ఇది సంచలనంగా మారింది. కానీ ఆదివారం ఎన్టీఆర్ టీం విడుదల చేసిన ఒక అఫీషియల్ statement తో ఈ రూమర్స్ అన్నీ గల్లంతయ్యాయి. ఆ ప్రకటన ఏం చెప్పిందంటే, జులై 18న ఎలాంటి political announcement ఉండదు.
“ఊరు వాడ” అనేది చాలా ముందు నుంచి ప్లాన్ చేసిన ఒక సోషల్ ఇనిషియేటివ్ అని టీం తెలిపింది. ఈ ఈవెంట్ ద్వారా ప్రోగ్రామ్ యొక్క విజన్, లక్ష్యాలను ఆడియన్స్‌కు పరిచయం చేయడమే మెయిన్ విషయం. దీనికి పొలిటిక్స్‌తో ఎలాంటి లింక్ లేదని గట్టిగా క్లారిఫై చేశారు. ఈ ఊరు వాడ కార్యక్రమం గురించిన పూర్తి డీటెయిల్స్, వేదిక, టైమింగ్ వంటివి త్వరలోనే తారక్ సొంత అఫీషియల్ అకౌంట్స్ ద్వారా నేరుగా రివీల్ చేయబోతున్నారు.
చివరగా, న్యూస్ పబ్లిషర్స్, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయినా సరే వెరిఫై చేయని న్యూస్‌ను షేర్ చేయవద్దని ఎన్టీఆర్ టీం ఒక రిక్వెస్ట్ చేసింది. తప్పుడు ప్రచారం వల్ల ఫ్యాన్స్‌లో గందరగోళం పెరిగిపోతుంది, కాబట్టి అఫీషియల్ అప్డేట్స్ కోసం rawntrofficial ఇన్‌స్టాగ్రామ్ లాంటి అకౌంట్స్‌నే ఫాలో అవ్వండి అని సూచించింది. ఈ సందర్భంగా అభిమానులు ఇచ్చిన continual support కి టీం థ్యాంక్స్ కూడా చెప్పింది.





