
KALVAKUNTLA KAVITHA : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి బయలు దేరిన ఆమె.. రాత్రి 10 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తాను చేయని తప్పునకు తనపై నాలుగేళ్లు మానసిక వేదన కలిగించారని తెలిపారు. దేవుని ఆశీస్సులతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కొట్టేశారని తెలిపారు. తిరుమలకు కాలినడకన వచ్చి స్వామి వారిని దర్శించుకోవడం తమ కుటుంబ మొక్కు అని తెలిపారు. KALVAKUNTLA KAVITHA
KALVAKUNTLA KAVITHA REACHED TIRUMALA ON FOOT
త్వరలోనే తెలంగాణ ప్రజలకు సేవ చేసే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా పూర్తిగా వైఫల్యం చెందారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వచ్చాయని.. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పని చేస్తుందని కవిత స్పష్టం చేశారు. ఎన్నికలకు పరిమితం కాకుండా తెలంగాణ హక్కుల పరిరక్షణ కూడా ముఖ్యమని తెలిపారు.
Also Read : MLA KOLIKAPUDI SRINIVAS RAO : ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు.. చంపేందుకు కుట్రలు
ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ ఉద్యమకారులు, మహిళలు, యువతను విస్మరించిందని ఆమె ఆరోపించారు. ఆ వర్గాల సమస్యలను తమ పార్టీ అజెండాగా తీసుకొని ముందుకు వెళ్తామని వెల్లడించారు. ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించే దిశగా తమ పార్టీ పని చేయబోతుందని స్పష్టం చేశారు. ఆంధ్రా ప్రజలు అంటే తమకు ఎలాంటి ద్వేషం లేదని..ఆంధ్రా రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకించామని తెలిపారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ప్రతి రాష్ట్రం తన అభివృద్ధి పై దృష్టి సారించాలని సూచించారు కల్వకుంట్ల కవిత.
Also Read : MP DHARMAPURI ARVIND : బీజేపీ కోవర్టు వ్యవహారాలపై ఎంపీ అరవింద్ ఫైర్..!




















