MLA KOLIKAPUDI SRINIVAS RAO : ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. చంపేందుకు కుట్ర‌లు

MLA Kolikapudi Srinivas

MLA KOLIKAPUDI SRINIVAS RAO : తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస రావు తాజాగా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. “న‌న్ను చంపేందుకు కొంద‌రు ప్ర‌యత్నిస్తున్నారు. నేను జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని నా గ‌న్ మెన్ కి నిఘా వ‌ర్గాలు సూచించాయి. కానీ నాకు భ‌ద్ర‌త క‌ల్పించ‌లేదు. క‌నీసం కానిస్టేబుల్ నికూడా ఇవ్వ‌లేదు. న‌న్ను అవ‌మానిస్తే స‌హిస్తానేమో.. కానీ నా జాతిని అవ‌మానిస్తే మాత్రం తెగిస్తా. న‌న్ను భూమి మీద లేకుండా చేయ‌డానికి చేస్తున్న కుట్ర‌ల‌పై విచార‌ణ జ‌ర‌పాలి” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. MLA KOLIKAPUDI SRINIVAS RAO

TDP MLA KOLIKAPUDI SIRNIVASRAO SENSATIONAL COMMENTS VIRAL

తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాస‌రావు మీడియా ముందు చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారాయి. వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో త‌న‌పై కేసులు న‌మోదు చేసింద‌ని.. ఏనాడు దాడి చేయ‌లేద‌న్నారు. కానీ టీడీపీ ప్ర‌భుత్వం లో త‌న పై దాడి, లేదంటే చంపేందుకు కుట్ర జ‌రుగుతుంద‌ని చెప్పుకొచ్చారు. ఎంపీ కార్యాల‌యం నుంచి త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు మండ‌లాల్లో కొంత మందికి ఫోన్ చేసి త‌న పై దాడి చేయ‌మ‌ని ఎందుకు చెప్పార‌ని ప్ర‌శ్నించారు ఎమ్మెల్యే శ్రీనివాస‌రావు. 

Also Read : THALAPATHY VIJAY : భార్యకు భయపడని విజయ్.. ప్రియురాలితో ఏకంగా పెళ్లికే!

నెమ‌లి వేణుగోపాల స్వామి ఆల‌యంలో క‌ళ్యాణం నిర్వ‌హించే స‌మ‌యంలో క‌రెంట్ క‌ట్ చేసి.. త‌న‌పై దాడి చేయాల‌ని, అలాగే త‌న కారు అద్దాలు ధ్వంసం చేసి టైర్ల గాలి తీసి దాడి చేయ‌మ‌న్న‌ట్టు త‌న‌కు స‌మాచారం ఉంద‌ని తెలిపారు. ఎంపీ కార్యాల‌యం నుంచి త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు మండ‌లాల్లో కొంత మందికి ఫోన్ చేసి త‌న‌పై దాడి చేయాల‌ని ఎందుకు చెప్పార‌ని ప్ర‌శ్నించారు ఎమ్మెల్యే శ్రీనివాస‌రావు. రేష‌న్ బియ్యం మాఫియా ను ప్ర‌శ్నించినందుకే త‌న‌ను టార్గెట్ చేస్తున్నార‌ని ఆందోళ‌న వ్యక్తం చేశారు.

Also Read : MP DHARMAPURI ARVIND : బీజేపీ కోవ‌ర్టు వ్య‌వ‌హారాల‌పై ఎంపీ అర‌వింద్ ఫైర్..!

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_