ANDHRA PRADESH: ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం.. 13 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు సోష‌ల్ మీడియా బ్యాన్..!

ANDHRA PRADESH: ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న‌ డిజిటల్ యుగంలో చిన్న పిల్లలు మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు బానిసలవుతున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. పిల్లల మానసిక ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. సోషల్ మీడియా వాడకాన్ని 13 ఏళ్లలోపు పిల్లలకు నిషేధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచన చేస్తోంది. తాజాగా క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య 16 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు నిషేదిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా అదే బాటలో పయనించనుంది. దీనికి సంబంధించి 90 రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ANDHRA PRADESH

AP GOVT SENSATIONAL DECISION SOCIAL MEDIA BAN FOR CHILDREN

ఇక ఇదే సమయంలో 13 -16 లోపు పిల్లలకు సంబంధించి సోషల్ మీడియా వాడకంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఈ అంశంపై టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పటికే పార్లమెంటులో ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. చిన్న పిల్లల్లో పెరుగుతున్న సోషల్ మీడియా వ్యసనాన్ని అరికట్టడానికి జాతీయ స్థాయిలో చట్టం రావాలని ఆకాంక్షించారు శ్రీకృష్ణ దేవ‌రాయ‌లు.

Also Read : KALVAKUNTLA KAVITHA : కాలిన‌డ‌కన తిరుమ‌ల‌కు చేరుకున్న క‌విత‌.. సెన్షేష‌న్ కామెంట్స్

చిన్న వయస్సులోనే సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గడం.. నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలు పెరిగే అవ‌కాశం ఉంటుంది. మొబైల్ ఫోన్లలో గంటల తరబడి గడపడం వల్ల విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నార‌నే చెప్ప‌వ‌చ్చు. వడపోత లేని సోషల్ మీడియాలో పిల్లలు హాని కరమైన, హింసాత్మకమైన కంటెంట్‌కు గురయ్యే ప్రమాద‌ముంది. ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు, సైబర్ బుల్లింగ్ వంటివి పిల్లల భద్రతకు ముప్పుగా మారుతున్నాయి. పిల్లల్లో మొబైల్ వ్యసనాన్ని అరికట్టడం ద్వారా వారిని తిరిగి ఆటపాటలు, పుస్తక పఠనం వైపు మళ్లించాలని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం భావిస్తోంది.


Also Read : MLA KOLIKAPUDI SRINIVAS RAO : ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీనివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. చంపేందుకు కుట్ర‌లు