
Kavitha: తెలంగాణ రాష్ట్రంలో కీలక పరిణామాలు నెలకొంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇటు కేసీఆర్ కుటుంబంలో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కెసిఆర్ ను కాదని, గులాబీ పార్టీని వదిలేసిన కల్వకుంట్ల కవిత, జాగృతి పేరుతో రాజకీయాలు చేస్తోంది. ఇప్పటికే కొంతమంది గులాబీ పార్టీ నేతలను కూడా తన పార్టీలో చేర్చుకొని రాజకీయాలు చేస్తోంది. Kavitha
Kavitha son adhithya in KCR politics
అయితే ఇలాంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అతడు రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. బీసీ బంద్ లో తాజాగా కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య కనిపించారు. బీసీ సంఘాల బంద్ పిలుపు నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. Kavitha
Also Read: Komatireddy Rajgopal Reddy: ఆస్తులు అమ్ముకున్నా.. కాంగ్రెస్ పై రాజగోపాల్ రెడ్డి మరో బాంబ్…
ఇందులో భాగంగానే ఖైరతాబాద్ చౌరస్తాలో జరిగిన మానవహారంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య కూడా పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపాడు ఆదిత్య. కేవలం మా అమ్మ మాత్రమే పోరాటం చేస్తే సరిపోదు ప్రతి ఇంటి నుంచి అందరు బయటకు వచ్చి పోరాడాలని కవిత కుమారుడు ఆదిత్య డిమాండ్ చేశారు. దీంతో కల్వకుంట్ల కవిత కుమారుడు రాజకీయాల్లోకి రాబోతున్నట్లు చర్చ మొదలైంది. Kavitha
Also Read: ponnam prabhakar: పొన్నం ప్రభాకర్ ఒక్కడుంటే చాలు.. కాంగ్రెస్ రెండు నిమిషాల్లో భూస్థాపితం ?





