KCR: వైసీపీ-BRS మధ్య రాజకీయ పొత్తు.. కేసీఆర్ 3.0 లోడింగ్?

KCR jagan may working in telangana as alliance

KCR: తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కూడా ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఏపీలో మొన్న 11 సీట్లకే వైసీపీ పార్టీ పరిమితం కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 స్థానాల వద్ద ఆగిపోయింది. దీంతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఈ రెండు పార్టీలు అధికారంలోకి రావడంతో ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కు అటు ఏపీలో జగన్ కు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. KCR

KCR jagan may working in telangana as alliance

ఊ… అంటే కేసులు పెట్టడం, బొక్కలో వేయడం జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో వైసిపి అలాగే గులాబీ పార్టీ రెండు కూడా పొత్తు పెట్టుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సమయానికి కేవలం తెలంగాణలో వైసిపి, గులాబీ పార్టీ పొత్తు ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో గులాబీ పార్టీ చాలా బలంగా ఉంది. అయితే నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ లాంటి ప్రాంతాల్లో మాత్రం గులాబీ పార్టీ ప్రదర్శన సరిగ్గా లేదు. KCR

Also Read: Kadiyam Srihari: కేసీఆర్ చనిపోతే, బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్క‌లే ?

ముఖ్యంగా ఖమ్మంలో అయితే ఎప్పుడైనా ఒకే ఒక్క సీటు వస్తోంది. అయితే ఈ మూడు జిల్లాల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు చాలా ఉన్నారు. జగన్కు కూడా ఫాలోవర్స్ విపరీతంగా ఉన్నారు. అయితే వైసీపీతో పొత్తు పెట్టుకుంటే ఆ మూడు జిల్లాల్లో గులాబీ పార్టీకి కనీసం ఐదు చొప్పున 15 సీట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారట. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా గులాబీ పార్టీ అధికారంలోకి రావడం గ్యారంటీ. ఆ దిశగా కేసీఆర్ అలాగే జగన్ అడుగులు వేస్తున్నారట. ఇక ఈ పొత్తు పొడుస్తే కేసీఆర్ 3.0 లోడింగ్ అంటూ గులాబీ పార్టీ నేతలు పోస్టులు పెడుతున్నారు. KCR

Also Read: Kavitha: కాంగ్రెస్‌, టీడీపీ పార్టీని క‌లుపుతున్న క‌విత‌..రెండు చీర‌లు క‌ట్టుకుని ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu