

Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. వైయస్ జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన జ్వరం వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో జగన్ మోహన్ రెడ్డి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి జ్వరం రావడంతో వైద్యులు ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు తెలుస్తోంది. Jagan
Former Chief Minister YS Jagan is suffering from fever
మొన్నటి వరకు బెంగళూరులోనే ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ పండుగ నేపథ్యంలో… పులివెందులకు చేరుకున్నాడు. మూడు రోజుల పర్యటనలో భాగంగా పులివెందుల చేరుకున్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ పర్యటన మొదటి రోజే జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైన జ్వరం వచ్చినట్లు చెబుతున్నారు. జ్వరం రావడంతో ఇవాళ పులివెందులలో చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. Jagan
Also Read: Tolivelugu Raghu: వివాదంలో తొలి వెలుగు రఘు…ఎన్ఐఏ నోటీసులు
రేపు కూడా జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం కోల్కోకపోతే రేపటి కార్యక్రమాలు కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే రేపే క్రిస్మస్ పండుగ కానున్న నేపథ్యంలో జ్వరం ఉన్నా కూడా అన్ని కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని మరికొంతమంది అంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి జ్వరం రావడంతో వైసిపి శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వెంటనే కోలుకోవాలని పూజలు చేస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Jagan
Also Read: KCR: ఏపీలో కేసీఆర్ పర్యటన..పార్థసారథి అదిరిపోయే కౌంటర్..?







