
Chennai Love Story సినిమా నుంచి విడుదలైన రెండో పాట ‘వదలనే..’ హైదరాబాద్‌లో ఘనంగా విడుదలైంది. ఈ పాటను ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు M. M. Keeravaani లాంచ్ చేశారు. Kiran Abbavaram, Sri Gouri Priya జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ Mani Sharma సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు మాధవపెద్ది సురేష్, కల్యాణి మాలిక్, అనూప్ రూబెన్స్, హరి గౌర, మార్క్ కె రాబిన్, సింజిత్ యెర్రమల్లి, చేతన్ భరద్వాజ్, స్వీకర్ అగస్తీ, సురేష్ బొబ్బిలి, వివేక్ సాగర్, శ్రీచరణ్ పాకాల వంటి పలువురు సంగీత దర్శకులు హాజరై మణిశర్మ మ్యూజిక్‌పై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ.. Baby సినిమా చూసిన తర్వాత తాను సాయి రాజేశ్ అభిమానిగా మారిపోయానన్నారు. “చెన్నై లవ్ స్టోరీ” పాటలు, విజువల్స్ చూస్తుంటే ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా కనిపిస్తోందని చెప్పారు. ‘వదలనే..’ పాట హాంటింగ్ మెలొడీగా ఉందని, సంగీత ప్రియులు ఈ పాటను మరచిపోలేరని అన్నారు. ఒక లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉండటం అంటే ఆ సినిమాలో భావోద్వేగాలు ఎంత బలంగా ఉంటాయో అర్థమవుతుందని పేర్కొన్నారు.
ఈ వేదికపై మాట్లాడిన సంగీత దర్శకులంతా మణిశర్మ ప్రభావం తమపై ఎంత ఉందో వెల్లడించారు. అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ మణిశర్మ ప్రేరణతోనే తాను కీబోర్డ్ ప్లేయర్ అయ్యానన్నారు. స్వీకర్ అగస్తీ మాట్లాడుతూ ఈ సినిమా తొలి పాటను తన సొంత పాటల కంటే ఎక్కువగా ప్రమోట్ చేశానని తెలిపారు.
దర్శకుడు రవి నంబూరి మాట్లాడుతూ ‘వదలనే..’ తన కెరీర్‌లో బెస్ట్ సాంగ్‌గా నిలుస్తుందని అన్నారు. ఈ పాట చిత్రీకరణ సమయంలో భావోద్వేగాలతో అందరి కళ్లలో నీళ్లు వచ్చిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. డీవోపీ డేనియల్ విశ్వాస్ మాట్లాడుతూ ఈ పాటను థియేటర్లలో చూస్తే ప్రస్తుతం వినిపిస్తున్న భావోద్వేగాల కంటే పదిరెట్లు ఎక్కువగా ఫీల్ అవుతారని అన్నారు.
నిర్మాత సాయి రాజేశ్ మాట్లాడుతూ మణిశర్మ నుంచి పూర్తిగా మెలొడీ ఆల్బమ్ రావాలని కోరుకుని ఈ చిత్రంలోని ఏడు పాటలను కూడా మెలొడీలుగానే రూపొందించామని తెలిపారు. ‘వదలనే..’ సినిమా లోని హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్‌లో వస్తుందని, సినిమా చూసిన తర్వాత కూడా ఈ పాట ప్రేక్షకులను వెంటాడుతుందని చెప్పారు.
హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ పాండిచ్చేరిలో ఒక అందమైన టెంపుల్ దగ్గర ఈ పాటను చిత్రీకరించామని తెలిపారు. దర్శకుడు రవి చెప్పిన ఒక సీన్ విని తాను, గౌరి, రవి ముగ్గురూ భావోద్వేగానికి గురయ్యామని అన్నారు. ఈ పాటలోని మొదటి విజువల్ తెలుగు సినిమాలో ఐకానిక్ సీన్‌గా నిలుస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి మణిశర్మ పాటలు పాడుతూ పెరిగానని, ఇప్పుడు ఆయన సంగీతం అందిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. సంగీతానికి ప్రాధాన్యత ఉన్న సినిమాలో నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందని చెప్పారు.
మణిశర్మ అందించిన మెలొడీస్, భావోద్వేగభరితమైన కథ, కిరణ్ అబ్బవరం – శ్రీ గౌరి ప్రియ జంట కెమిస్ట్రీతో “చెన్నై లవ్ స్టోరీ”పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.




















