
Konda Surekha: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో కొండా సురేఖ పంచాయతీ తెరపైకి వచ్చింది. డెక్కన్ సిమెంట్ కంపెనీని కొండా సురేఖకు సంబంధించిన సుమంత్ బెదిరించినట్లు కేసులు నమోదయ్యాయి. గన్ పెట్టి మరి ఆ యాజమాన్యాన్ని బెదిరించాడట సుమంత్. ఇలాంటి నేపథ్యంలో కొండా సురేఖ ఇంట్లో ఉన్న సుమంత్ ను బొక్కలో వేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ వేసింది. Konda Surekha
Konda Surekha asks for KCR’s appointment
అయితే దీనిపై కొండా సురేఖ కుటుంబం తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి తో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి పరువు తీస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్. ఇప్పటికీ కూడా ఆమె వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం దిగివచ్చినా కూడా కొండా సురేఖ వినడం లేదు. కేబినెట్ నుంచి తప్పిస్తే, బండారం మొత్తం కొండా సురేఖ బయటపెట్టే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. దీంతో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. Konda Surekha
Also Read: ponnam prabhakar: పొన్నం ప్రభాకర్ ఒక్కడుంటే చాలు.. కాంగ్రెస్ రెండు నిమిషాల్లో భూస్థాపితం ?
అయితే ఇలాంటి నేపథ్యంలో కొండా సురేఖ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెసిఆర్ అపాయింట్మెంట్ కొండా సురేఖ దంపతులు అడిగారట. కెసిఆర్ ఫామ్ హౌస్ అధికారులకు ఈ మేరకు సమాచారం అందినట్లు చెబుతున్నారు. అయితే కొండా సురేఖ అపాయింట్మెంట్ అడగడంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొత్త చర్చ మొదలైంది. కొండ సురేఖకు కేసిఆర్ అపాయింట్మెంట్ ఇస్తారా ? ఇవ్వరా ? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానిపైన చర్చ జరుగుతోంది. గతంలోని కెసిఆర్ కుటుంబం పై అనేక రకాల వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. అలాంటి వ్యక్తికి కేసీఆర్ దూరంగా ఉంటాడని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే సమంత వర్సెస్ కేటీఆర్ వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చెప్పించాడని కేసీఆర్ ముందు కొండా సురేఖ చెప్పే ఛాన్సులు ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. Konda Surekha
Also Read: Male Ear Piercing: అబ్బాయిలు చెవులను కుట్టించుకోవచ్చా..ఇలా చేస్తే ప్రమాదం తప్పదా ?





