
Dhulipalla Narendra: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టిడిపి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ సంఘటన బయటకు రావడంతో ఏపీలో కలకలం చోటుచేసుకుంది. Dhulipalla Narendra
Massive theft at TDP MLA Dhulipalla Narendra’s house
పొన్నూరు కూటమి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడ్డట్లు సమాచారం అందుతోంది. ఈ సందర్భంగా 50 తులాల బంగారం, 10 కిలోల వెండి అలాగే లక్ష రూపాయల నగదు దొంగతనం చేశారట దుండగులు. Dhulipalla Narendra
Also Read: BRS: జనగామ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక..బీఆర్ఎస్ కు ఊహించని షాక్
ఈ సంఘటన జరిగినప్పుడు టిడిపి ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర విదేశాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే సంఘటన జరిగిన వెంటనే చింతలపూడి పోలీసులకు ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. Dhulipalla Narendra
Also Read: BRS: బుల్లెట్ దిగిందా లేదా? గూడెం మహిపాల్ రెడ్డి అదిరిపోయే డైలాగ్




















